ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేరెత్తిన మహామహా రాజకీయ నేతలకు కూడా ఓటమి తప్పలేదు. దశాబ్దాలుగా తమ నియోజకవర్గం నుంచి వరసగా నెగ్గుతూ వచ్చిన వారు కూడా చిత్తయ్యారు. ఆ జాబితాలో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబానికి కూడా మినహాయింపు లభించలేదు. అక్కడ పార్టీ ఏదైనా గెలుపు మాత్రం జేసీ సోదరులదే అనే పరిస్థితి కొనసాగింది.
అయితే ఈ సారి కథ అడ్డం తిరిగింది. అటు అనంతపురం ఎంపీ సీట్లో జేసీ పవన్ ఓడటంతో పాటు , తాడిపత్రిలో జేసీ అస్మిత్ ఓడిపోయారు. ఓటమి తర్వాతే అసలు కథ అర్థం అవుతుంది కదా. అందుకే చాలా మంది ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
అలా అనేక మంది రాజీనామాలను అందుకున్నారు. కానీ వారిని మళ్లీ వెనక్కు పిలిపించుకుంటున్నారట జేసీ సోదరులు. అది టీడీపీ పై ప్రేమ కాకపోయినా, తమ పట్టు తగ్గిపోతుందనే లెక్కలతో జేసీ సోదరులు ఇలా వ్యవహరిస్తున్నారట. ప్రత్యేకించి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడిన నేతలకు కాల్స్ చేసి గట్టిగానే మాట్లాడుతున్నారట.
గట్టిగా మాట్లాడటం అంటే బెదిరింపులే! పచ్చి బూతులు తిడుతూ వారిని వచ్చి తనను కలవమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఇన్నాళ్లూ తమ దగ్గర నుంచి పొందిన లబ్ధిని గుర్తు చేస్తూ జేసీ తిడుతూ ఉన్నాడట. దీంతో వారు వెనక్కు రాకతప్పడం లేదని సమాచారం. అలా వచ్చిన వారిని కూడా మొదట తిట్టి, తర్వాత వారి భుజాల మీద చేతులు వేసి పోజులు ఇస్తున్నాడట ప్రభాకర్ రెడ్డి!