సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. కొత్త పార్టీ పెడుతారనే చర్చకు చెక్ పెట్టి ఆయన లోక్ సత్తాకు జై కొడుతారని ప్రచారం జరుగుతోంది. లోక్ సత్తా అధ్యక్షుడిగా నియమితుమవుతారని ప్రచారం జరుగుతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్ సత్తా అధినేత కానున్నట్లు తెలిసింది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుని లోక్ సత్తాలో అధ్యక్ష పదవి స్వీకరించబోతున్నట్లు సమాచారం. తాజాగా మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శినీ ఆడిటోరియంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఇదే సిగ్నల్స్ ఇచ్చారు.
సీబీఐ జేడీగా ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా రిటైరైన తరువాత ఏపీలో పలు జిల్లాలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా రైతాంగ సమస్యలపై అధ్యయనం చేశారు. దీర్ఘకాలంగా వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. వివిధ వర్గాలతో మమేకమయ్యారు. పలువురు ప్రముఖులతోనూ భేటీలు నిర్వహించారు. వారితో అభిప్రాయాలు - ఆలోచనలు పంచుకున్నారు. వీటన్నింటిని క్రోడీకరించుకున్న మీదట కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. జనధ్వని అనే పేరును కూడా పరిశీలించారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం కంటే...లోక్ సత్తా వంటి పార్టీలో చేరి దాన్ని నడిపించడం మేలనే భావనకు తాజాగా వచ్చారని ప్రచారం జరిగింది.
అయితే, దీనిపై ఆయన తాజాగా ఇంకో క్లారిటీ ఇచ్చారు. తాము రెడీ చేసిన పీపుల్స్ మ్యానిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తామన్నారు. ``ప్రజా జీవనంలోకి రావడం అనేది ఖచ్చితం..వచ్చే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ లో పోటీలో ఉంటాను. నా భవిష్యత్ పై త్వరలోనే ప్రకటన చేస్తా`` అని ప్రకటించారు. నాతో కలిసి నడిచేందుకు ఆమ్ ఆద్మీ - లోక్ సత్తా నేతలు అంగీకరించారు. ప్రజా జీవితంలోకి ఎలా వెళ్తాను అనేది త్వరలోనే ప్రకటిస్తాం. ఒంటరిగానా - లేదంటే నాతో కలిసి పనిచేసే వాళ్ళను కలుపుకొని వెల్తానా అనేది త్వరలో ప్రకటన చేస్తా`` అని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. `` సమాజంలో మార్పుకోసం ప్రయత్నం చేయడం తప్పు కాదు...నిజాయితీగా ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది అనేది నా నమ్మకం. నా ప్రజలు - రైతులు దుక్కిస్తున్నారు...వాళ్ళ కన్నీళ్లు తీర్చడానికి ప్రయత్నం చేస్తా. తెలుగు రాష్ట్రాల్లో కొత్త విధానాలను - ఒరవడిని తీసుకొస్తాను`` అని అన్నారు.
జగన్ పై దాడి ఏపీ ప్రభుత్వం వైఫల్యమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ``జగన్ కేసులో విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో జరిగే ప్రతి క్రైమ్ కు రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది కాబట్టి సీబీఐని సైతం రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది. పుష్కరాలు - నవనిర్మాణ దీక్షల కోసం ఖర్చులు అవసరం లేదు.`` అని మండిపడ్డారు.