జేడీ లక్ష్మీ నారాయణ సీబీఐ అధికారిగా పాపులర్. ఆయన ఇప్పటికి పుష్కర కాలం క్రితం జగన్ ఆస్తుల విషయంలో కేసులు నమోదు చేసి సంచలనం రేకెత్తించారు. అప్పట్లో ఆయన పాపులారిటీ సినీ హీరోలకు మించిన స్థాయిలో ఉండేది. ఒక నిబద్ధత కలిగిన అధికారిగా జేడీ ఆనాడు వ్యవహరించి తీరుకు మధ్యతరగతి వర్గాలు, యువత, విద్యావంతులు ఫిదా అయ్యారు.
అలా ఆయన తన వృత్తిపరంగా బలమైన వర్గాలను తన వైపునకు తిప్పుకున్నారు. ఇక నాలుగేళ్ల క్రితం ఆయన ఉన్నతమైన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి దాదాపుగా మూడు లక్షల దాకా ఓట్లను రాబట్టారు.
ఆయన ఓడినా కూడా విశాఖను విడిచిపెట్టకుండా తనదైన శైలిలో పోరాటాలు చేస్తున్నారు. తాజాగా కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో జేడీ తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అది కూడా విశాఖ నుంచే ఎంపీగా బరిలో ఉంటానని స్పష్టం చేశారని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఏ పార్టీ తరఫున అన్న దాని మీద ఆయన కొంత సస్పెన్స్ లో పెట్టారు.
ఏ పార్టీ తరఫున పోటీ చేయకపోతే మాత్రం ఇండిపెండెంట్ గా తాను బరిలో ఉంటాను అని ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీని మీద తన సన్నిహితులతో చర్చలు సాగుతున్నాయని అన్నారు. ఇదిలా ఉంటే జేడీ వాయిస్ అంతా విపక్షాలకు అనుకూలంగా సాగుతోంది. ఆయన ఈ మధ్య ఎన్నికల సంస్కరణలు అంటూ చాలా విషయాలను పంచుకుంటున్నారు. అవినీతిపరులకు ఎన్నికల్లో చోటు లేకుండా చూడాలని కోరుకుంటున్నారు.
ఇంకో వైపు ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. ఇలా చాలా విషయాలలో ఆయన గొంతు విపక్షాలతో కలుస్తోంది. దాంతో ఆయన కచ్చితంగా వైసీపీకి యాంటీగా ఉంటారని అంటున్నారు. విపక్షాలలో చూస్తే జనసేన, బీజేపీ, టీడీపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీలలో ఏదో ఒక దాన్ని ఎంచుకుని ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని, ఒక వేళ అది కనుక కుదరకపోతే మాత్రం ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారు అని అంటున్నారు.
ఆయన ఇండిపెండెంట్ గా దిగినా టీడీపీ నుంచి మద్దతు ఉంటుందని, అలాగే మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చినా ఇస్తాయని అంటున్నారు. మొత్తానికి విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా జేడీ విశాఖ నుంచి పోటీ చేసి వైసీపీకి ఓడించేందుకు భారీ ప్లాన్ ని రెడీ చేశారు అంటున్నారు. మరి ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిందే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.