జేడీ క్లారిటీ- కొత్త పార్టీయే పెడ‌తా !

Update: 2018-11-28 17:07 GMT
డైల‌మాలో ఉన్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ నిర్ణ‌యం తీసేసుకున్నారు. ఆయ‌న త్వ‌ర‌లో కొత్త పార్టీ  పెట్ట‌నున్నారు. సంస్థ న‌డ‌పాలా? ఏదైనా పార్టీలో చేరాలా? పార్టీ పెట్టాలా? అన్న సంశ‌యంలో ఉన్న ఆయ‌న‌కు లోక్‌ స‌త్తా పార్టీ నుంచి పార్టీని తీసేసుకోమ‌ని పిలుపు వ‌చ్చింది. దానిపై ఆలోచిస్తా అని చెప్పిన జేడీ తాజాగా కొత్త పార్టీయే పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈమేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త్వరలో తాను కొత్త పార్టీ పేరును వెల్ల‌డిస్తాను అన్నారు.

  రాష్ట్రంలో ఆయ‌న అంద‌రికీ తెలిసిన మ‌నిషి. జ‌గ‌న్ కేసు డీల్ చేయ‌డం వ‌ల్లే తాను అంద‌రికీ తెలిశాన‌ని స్వ‌యంగా ఆయ‌నే చెప్పుకున్నారు. కానీ మొద‌ట్నుంచి ఆయ‌న అడుగులు కొంచెం అనుమానాస్ప‌దంగానే ఉన్నాయి. ఆయ‌న వెనుక ఎవ‌రైనా ఉన్నారా అని కూడా కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేశారు. అయితే వీటిని ల‌క్ష్మీనారాయ‌ణ కొట్టి పారేశారు. తాను గ్రామ‌ స్వ‌రాజ్యం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని తెలిపారు.

ఈరోజు సంశయాలు అన్ని తుడిచేస్తూ తన రాజకీయ ప్రవేశం సొంత పార్టీ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు.  సన్నిహితులు - అభిమానుల సూచన మేరకు సొంత పార్టీకే మొగ్గు చూపిన‌ట్లు చెప్పారు. కొత్త పార్టీ పేరు - విధి విధానాలు - ప్రారంభ తేదీ త్వరలోనే వెల్ల‌డిస్తాను అన్నారు.

సీబీఐలో ప‌నిచేసిన లక్ష్మీనారాయణ మ‌హారాష్ట్రలో డిప్యూటేష‌న్ పై కూడా ప‌నిచేశారు. అక్క‌డే ఉద్యోగానికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు. చివ‌ర‌కు రాజీనామా చేశారు. ఏపీలోని 13 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎక్కువ‌గా రైతుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. చివ‌ర‌కు పార్టీ పెట్టాల‌ని ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. ఈరోజు ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.
 
   

Tags:    

Similar News