జేడీ లక్ష్మీనారాయణ...తన ఉద్యోగాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న సీబీఐ మాజీ అధికారి. అధికారిగా తన జర్నీ పూర్తి చేస్తున్న తరుణంలో తన రాజకీయ ప్రయాణంపై అనేక ట్విస్టులు ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ ప్రకటించబోతున్నారంటూ ప్రచారంలో నిలిచారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ - పార్టీ విషయాలు అనౌన్స్ చేయటానికి మరికొంత సమయం కావాలంటూ చెప్పుకొచ్చారు. పార్టీ పేర్లపై వచ్చిన ప్రచారంపై నోరు విప్పని ఆయన.. అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందింది అని చెప్పుకొచ్చారు. అనంతరం లక్ష్మీనారాయణ టీడీపీతో చర్చలు జరిపి జనసేనలో చేరారు! ఆయనకు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధినేత పవన్ అవకాశం కల్పించగా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జనసేనలో ఉన్న లక్ష్మీనారాయణ బీజేపీ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఆయన వైపు చూస్తోందని, ఇందుకోసం ఓ ముఖ్యనేత మంతనాలు జరుపుతున్నారని టాక్.
ప్రస్తుతం జనసేనలో ఉన్న లక్ష్మీనారాయణ..ఎన్నికల్లో ఓటమి అనంతరం అంత క్రియాశీలంగా పార్టీలో పనిచేయడం లేదు. కొద్దికాలం క్రితం రాయలసీమలో పార్టీని బలోపేతం చేయాలని భావించిన పవన్ కళ్యాణ్...ముఖ్యమంత్రి ఇలాకా కాబట్టి సమర్థుడైన వ్యక్తిని అందుకు ఎంచుకోవాలని...లక్ష్మీనారాయణకు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే, ఆ బాధ్యతలపై కూడా లక్ష్మీనారాయణ అంతగా దృష్టి సారించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ...లక్ష్మీనారాయణపై కన్నేసినట్లు సమాచారం. టీడీపీ నుంచి బీజేపీలోకి జంపయిన ఎంపీ సుజనాచౌదరి ఈ మేరకు మంతనాలు జరుపుతున్నట్లు టాక్. ఈ ప్రచారం నిజమై జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరితే...ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అది ఊహించని షాక్ వంటిదని అంటున్నారు.
జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే భవిష్యత్ ఉంటుందని - మరోవైపు రాష్ట్రంలో జనసేన రోజురోజుకూ బలహీన పడుతోందని - ముఖ్యనేతలు సైతం పవన్ కళ్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారని...బీజేపీ నేతలు జేడీ లక్ష్మీనారాయణకు హితబోధ చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ ఒక్కటంటే ఒక్కసీటే గెలిచిందని...అధ్యక్షుడు పవన్ సైతం రెండు చోట్లా ఓటమి పాలయ్యారని...ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ వైపే మొగ్గుచూపుతున్న నేపథ్యంలో...బీజేపీలో రావాలని సలహా ఇస్తున్టన్లు తెలుస్తోంది. అయితే, దీనిపై జేడీ నిర్ణయం వెలువడాల్సి ఉంది. కాగా, గతంలో..సైతం ఇదే రీతిలో జేడీ లక్ష్మీనారాయణ పార్టీ మారే ప్రచారం జరగడం దాన్ని ఆయన ఖండించడం తెలిసిన సంగతే. తాజా పుకార్ల నేపథ్యంలో ఈ మాజీ ఐపీఎస్ అధికారి క్లారిటీ ఇస్తారా? మౌనం దాల్చి కన్ఫ్యూజ్ చేస్తారో తెలియడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.