సీబీఐ మాజీ జేడీ - తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదుపరి అడుగులపై రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు సిగ్నల్స్ ఇస్తున్న ఆయన..అందుకు తగిన రీతిలో పలు అడుగులు వేస్తున్నట్లుగానే ఉంది. అయితే అదే సమయంలో అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటిస్తుండటం కొత్త చర్చకు కారణం అవుతోంది. స్థూలంగా మాజీ ఐపీఎస్ అధికారి క్లారిటీ ఇచ్చారో కన్ఫ్యూజ్ చేశారో తెలియడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
వ్యక్తిత్వవికాసానికి సంబంధించి రాజమండ్రిలో జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ అక్కడకు వెళ్లారు. అయితే లక్ష్మీ నారాయణ ఈ కార్యక్రమానికే పరిమితమే కాకుండా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్య నారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కొద్దికాలం క్రితమే ఆయన బీజేపీ మాతృక అయిన రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చకు ఎప్పట్లాగే తనదైన ట్విస్ట్ ఇచ్చారు మాజీ జేడీ
తన రాజకీయం ప్రవేశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని..వాటిల్లో అస్సలు నిజం లేదని వాటిని నమ్మొద్దని లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. తనను ఓ సామాజికవర్గంతో అంటగట్టారని.. సంఘంతో అనుబంధం ఉంది కాబట్టి ఇంకో పార్టీ వైపు వెళతా అంటున్నారని.. అయితే ఆ వార్తలు సత్యదూరమన్నారు. తాను సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తానని.. సామాజికవర్గం గురించి ఆలోచించనన్నారు. బీజేపీలో చేరతానని నేనెప్పుడు చెప్పాను..? ఏ పార్టీలో చేరేదీ నేనే చెబుతా’ అని ఓ ప్రశ్నకు జవాబుగా తెలిపారు.