సీనియర్ ఐపీఎస్ అధికారి.. నిజాయితీకి నిలువెత్తు రూపమని చెప్పే లక్ష్మీనారాయణ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా తప్పని.. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని తేల్చి చెప్పారు.
జనాల్ని రెచ్చగొట్టేలా మీడియా ఉండకూదన్న ఆయన.. సమాజంలో అధ్యాత్మికత తగ్గటమే పసిపిల్లలు.. మహిళలపై అత్యాచార ఘటనలు పెరగటానికి ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తేల్చారు.
తనకెప్పుడూ ప్రజల మధ్యన ఉండటమే ఇష్టం తప్పించి.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకుందన్న ఆయన.. ప్రస్తుతం మహారాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో లక్ష్మీనారాయణ ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే.. వాటిల్లో నిజం లేదని లక్ష్మీనారాయణే స్వయంగా తేల్చేయటం గమనార్హం.