యడ్యూరప్ప రాజీనామా? 5 నెలల్లో కొత్త సీఎం!

Update: 2019-09-14 08:46 GMT
యడ్యూరప్ప.. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి.. కానీ వచ్చే ఫిబ్రవరి తర్వాత మాజీ ముఖ్యమంత్రేనట.. యడ్యూరప్పను దించేసి బీజేపీ కొత్త నేతను కన్నడ సీఎంను చేస్తారని జేడీఎస్ నాయకుడు శరణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ‘ఆపరేషన్ కమల’ పేరుతో యడ్యూరప్ప చేసిన లాలూచీ వ్యవహారాల ఆడియో టేపులను ఇదే జేడీఎస్ నేత శరణ గౌడ అప్పట్లో వరుసగా రిలీజ్ చేసి యడ్డీకి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిబ్రవరిలో కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నాడని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఫిబ్రవరిలో సీఎం యడ్యూరప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆయన పదవికి రాజీనామా చేస్తారని.. ఆయన స్థానంలో బీజేపీలో సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీఎస్ నేత శరణగౌడ కామెంట్ చేశారు. కర్ణాటకలో గురుమిట్కల్ నియోజకవర్గంలో తాజాగా జేడీఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొని మాట్లాడిన శరణ గౌడ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. యడ్యూరప్ప ఆపరేషన్ కమల పేరిట మాట్లాడిన ఆడియో టేపుల కేసును మళ్లీ రీఓపెన్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు తమ మీద ఒత్తిడి చేస్తున్నారని.. బీజేపీలోని ప్రముఖ నాయకుడే యడ్యూరప్పను దించేసే కుట్రకు తెరతీశాడని.. తనతో చాలాసార్లు ఫోన్ లో మాట్లాడారని శరణ గౌడ బాంబు పేల్చారు.

యడ్యూరప్ప చరిత్ర మొత్తం అవినీతి, కుట్రలు కుతంత్రాలని.. ఆయన ఐదు నెలలే సీఎంగా ఉంటారని జేడీఎస్ నేత శరణగౌడ స్పష్టం చేశారు. ఇక బీజేపీ ఎంపీ శోభ కరందాజ్లేతో రాసుకుపూసుకు తిరుగుతున్న సీఎం యడ్యూరప్ప వ్యవహారం కూడా ఆయనను తీసేయడానికి కారణమవుతోందని సంచలన కామెంట్ చేశారు. ఇలా అన్నీ బేరేజు వేసుకొనే యడ్యూరప్పను సీఎం కూర్చీలోంచి లేపేసే వ్యవహారం జరుగుతోందని శరణ గౌడ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు కన్నడ నాట చర్చనీయాంశంగా మారాయి.
    

Tags:    

Similar News