దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత స్వతంత్ర్య అభ్యర్థిగా మాండ్య లోక్ సభ సీటు నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.. అంబరీష్ స్వస్థలమైన ఈ సీటును కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఆమె రెబల్ గా బరిలోకి దిగారు. ఆమెకు మద్దతుగా కన్నడ స్టార్ హీరోలు దర్శన్ - యష్ లు నిలిచారు. ఆమె నామినేషన్ కు హాజరై మద్దతుగా ప్రచారం కూడా చేస్తామన్నారు.
కాగా ఇదే స్థానంలో సుమలతపై సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీచేస్తున్నారు. దీంతో ఈ హాట్ సీటుకు తీవ్ర పోటీ నెలకొంది. స్టార్ హీరోలు సుమలత వెంట ఉండడంతో అధికార జేడీఎస్ నేతలకు గుబులు పట్టుకుంది. తాజాగా కేఆర్ పేట జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణ గౌడ స్టార్ హీరోలను బెదిరించాడు. సినీ హీరోలు ఇలాగే మద్దతిస్తే తగిన గుణపాఠం చెబుతామని.. నటుల అక్రమాలు - జాతకాలు వెలికి తీస్తామని స్పష్టం చేశారు.
కన్నడ నటులు గౌరవంగా వారి ఇళ్లలో ఉండాలని.. ప్రచారం పేరిట జేడీఎస్ - నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాజకీయాలకు ఆ హీరోలు దర్శన్ - యశ్ లకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఇళ్లలోనే ఉండాలని.. రోడ్డు మీద కొచ్చి తిడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
అయితే ఈ హెచ్చరికలపై ‘నమ్మ కర్ణాటక రక్షణ వేదిక’ అధ్యక్షుడు జయరాజ్ నాయుడు బృందం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దర్శన్ - యష్ లు ప్రచారం చేస్తారని.. వారి సినిమాలకు ఎన్నికల కోడ్ వర్తింప చేయకుండా విడుదల చేసేలా అనుమతివ్వాలని కోరారు.