డ‌బ్బుల్లేక చాలా టైట్ గా ఉంద‌న్న మాజీ ప్ర‌ధాని

Update: 2018-05-10 09:51 GMT
ఒక మాజీ ప్ర‌ధాని నోటి నుంచి డ‌బ్బుల మాట వ‌చ్చే అవ‌కాశం ఉందా? అంటే.. నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి స‌మాధాన‌మే మీది అయితే త‌ప్పులో కాలేసిన‌ట్లే. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ తీవ్ర ఆర్థిక క‌ట‌క‌ట‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు చెప్పారు. అయితే.. ఆ టైట్ అంతా ఆయ‌న వ్య‌క్తిగ‌తం కాదు సుమా. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే జేడీఎస్ పార్టీ ప‌రిస్థితి గా చెబుతున్నారు.

వ‌రుస పెట్టి ఓట‌మి మీద ఓట‌మి వ‌స్తున్న వేళ‌.. ఒక ప్రాంతీయ‌పార్టీ నిధుల ఇబ్బందికి గురి కావ‌టం మామూలే. దీనికి తోడు.. రెండు జాతీయ పార్టీలు పోటాపోటీగా ఖ‌ర్చు చేస్తున్న వేళ‌.. బ‌రిలో ఉన్న ప్రాంతీయ పార్టీకి నిధుల క‌ష్టాలు ఎంత‌లా ఉంటాయో దేవెగౌడ చెబుతున్నారు.

బీజేపీ కాంగ్రెస్ పార్టీలు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల కోసం పెద్ద ఎత్తున డ‌బ్బు కుమ్మ‌రిస్తున్నార‌న్నారు. త‌మ పార్టీ నిధుల లేమితో తీవ్ర ఇబ్బందికి గుర‌వుతున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో తానేం చేయ‌లేన‌ని.. ఎన్నిక‌ల్లో పోరాడేందుకు ఎవ‌రూ త‌న‌కు నిధులు స‌మ‌కూరుస్తారు? అంటూ ప్ర‌శ్నించారు.

ఎన్నో ఇబ్బందుల మ‌ధ్య తాము రెండు జాతీయ పార్టీల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్న్ట‌లు చెప్పారు. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు హంగ్ వ‌స్తుందంటూ చెబుతున్న స‌ర్వేలు నిజం కావ‌న్నారు. కాంగ్రెస్‌.. బీజేపీకి ధీటుగా త‌మ పార్టీ స‌త్తా చాటుతుంద‌న్న దేవెగౌడ .. హంగ్ అంశం పెద్ద విష‌యం కాద‌న్నారు. ఒక‌వేళ‌.. అలాంటి ప‌రిస్థితే వ‌స్తే.. త‌మ పార్టీ ఒక నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు. ఇన్ని మాట‌లు చెప్పిన దేవెగౌడ తమ పార్టీకున్న నిధుల టైట్ ను ఎలా అధిగ‌మిస్తార‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. మ‌రి.. పెద్దాయ‌న బాధ‌ను ఎవ‌రు తీరుస్తారో..?
Tags:    

Similar News