బిహార్ లో వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది!

Update: 2019-06-03 10:27 GMT
మోడీ అంటే ఇప్పుడో భ‌యంతో కూడిన భ‌క్తి.  తాజాగా ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ మాష్టారు సాధించిన ఫ‌లితాల‌తో ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు సైతం ఆయ‌న్ను విమ‌ర్శించ‌టం మానేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోడీ ఏం చేసినా?  ఎలా వ్య‌వ‌హ‌రించినా చూస్తూ ఊరుకోవాలే కానీ.. అంత‌కు మించి.. ఒక్క అడుగు ముందుకు వేయ‌టం మంచిది కాద‌న్న భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇలాంటివేళ‌.. ఈ తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారారు బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌. మోడీ మీద మొద‌ట్నించి కాక మీద ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ధ్య‌లో రాజీ ప‌డి మోడీతో దోస్తానాకు సిద్ధం కావటం తెలిసిందే. అలాంటి ఆయ‌న తాజాగా కేంద్ర కేబినెట్ లో జేడీయూకి ప‌ద‌వులు కేటాయించే విష‌యంలో మోడీ తీరుపై గుర్రుగా ఉన్న ఆయ‌న‌.. కేంద్ర‌మంత్రి ప‌ద‌వులు తీసుకోకుండా ఉండ‌టం తెలిసిందే.

కేంద్రంలో త‌మ పార్టీకి ఒక కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇస్తానంటూ మోడీ చేసిన ఆఫ‌ర్ పైన గుర్రుగా ఉన్న ఆయ‌న‌.. మంత్రివ‌ర్గంలో చేర‌మ‌ని స్ప‌ష్టం చేయ‌టం.. దీంతో మోడీ.. నితీశ్ ల మ‌ధ్య విభేదాలు షురూ అయ్యాయి. మోడీకి బదులు తీర్చుకోవ‌టంలో భాగంగా బిహార్ ప్ర‌భుత్వంలో బీజేపీ నేత‌ల‌కు మొండి చేయి చూపిస్తూ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టారు. దీంతో వీరిద్ద‌రి మధ్య లొల్లి మ‌రో లెవ‌ల్ కు చేరుకుంది.

కేంద్రంలో ఎనిమిది మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని చెప్పిన మోడీ త‌మ‌ను మోసం చేసిన‌ట్లుగా నితీశ్ వ‌ర్గం ఆరోపిస్తోంది. అయితే.. దీనిపై బీజేపీ నేత‌లు ఏం మాట్లాడ‌టం లేదు. ఇదిలా ఉంటే.. ఈ రెండు పార్టీలు వేర్వేరుగా ఇచ్చుకున్న ఇఫ్తార్ విందుల‌కు.. ఎవ‌రికి వారే అన్న‌ట్లుగా విందులునిర్వ‌హించారే త‌ప్పించి.. మిత్రుల విందుల‌కు వెళ్ల‌కుండా ఉండిపోయారు.  ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో బీజేపీ.. జేడీయూల మ‌ధ్య రాజ‌కీయ వైరం అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News