అనుకున్నంతా అయ్యింది. బీహార్ అధికార పార్టీగా ఉన్న జేడీయూ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పై బహిష్కరణ వేటు పడింది. పీకేతో పాటు జేడీయూకు చెందిన మరో కీలక నేత పవన్ కుమార్ వర్మను కూడా జేడీయూ అధిష్టానం బహిష్కరించేసింది. ఈ మేరకు బుధవారం పార్టీ జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి... ప్రశాంత్ కిశోర్ తో పాటు పవన్ కుమార్ వర్మలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగానే కాకుండా వారి ప్రాథమిక సభ్యత్యాలను కూడా రద్దు చేస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. మొత్తంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ కెరీర్ అతి కొద్ది కాలంలోనే ముగిసిపోయిందని చెప్పాలి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎలాగైనా బీజేపీ సర్కారును ఏర్పాటు చేయాల్సిందేనన్న కసితో సాగిన నరేంద్ర మోదీ... పార్టీ ప్రచార వ్యూహాలను రచించే బాధ్యతను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా అప్పుడప్పుడే ప్రస్థానం ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ కు అప్పజెప్పారు. ‘చాయ్ పే చర్చా’ అంటూ తనదైన శైలి ప్రచార వ్యూహాలను రచించిన పీకే... సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించారు. వెరసి తనపై మోదీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని పీకే... బీజేపీకి రికార్డ్ విక్టరీని అందించారు. ఆ తర్వాత బీహార్ లో, ఏపీలో, యూపీలో తనదైన మార్కు ప్రచార వ్యూహాలను అమలు పరచిన పీకే... రాత్రికి రాత్రే దేశ రాజకీయాల్లో ఓ కీలక కేంద్రంగా మారిపోయారు.
ఈ క్రమంలో ఏపీలో వైసీపీకి స్ట్రాటజిస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో తన సొంత రాష్ట్రం బీహార్ లో అధికార పార్టీగా ఉన్న జేడీయూ నుంచి, సీఎం నితీశ్ కుమార్ నుంచి పిలుపు రాగానే... ముందూ వెనుకా ఆలోచించకుండా జేడీయూలో పీకే చేరిపోయారు. తన పిలుపును మన్నించి పార్టీలోకి వచ్చిన పీకే... నితీశ్ అత్యధిక ప్రాదాన్యం ఇవ్వడంతో పాటుగా పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చి... తన తర్వాత సీఎం వ్యక్తి కూడా పీకేనని కూడా చెప్పేశారు. అయితే కాలక్రమంలో ఏమైందో తెలియదు గానీ... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కొత్తగా తెచ్చిన సీఏఏ - ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మిత్రపక్షంగా ఉన్న జేడీయూ నేత తనపై విమర్శలు చేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ... నితీశ్ ను పిలిపించి పీకేను హద్దుల్లో పెట్టుకోవాలని సూచించింది. దీంతో పీకేను నిలువరించేందుకు నితీశ్ యత్నించినా... కుదరకపోవడంతో ఏకంగా జేడీయూ నుంచి పీకే సహా పవన్ కుమార్ వర్మలను బహిష్కరిస్తూ నితీశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.