బీహార్ చివరి విడత ఎన్నికల పోలింగ్ వేళ విషాదం నెలకొంది. ఈరోజు 78 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది.
మధుబనిలోని బెనిపట్టి అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగిన స్వతంత్ర్య అభ్యర్థి నీరజ్ ఝా కరోనా వైరస్ తో మరణించడం విషాదం నింపింది. గత కొద్దిరోజులుగా నీరజ్ ఝా కరోనా బారినపడ్డారు. ఆయన పాట్నా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. జేడీయూ నాయకుడిగా ఉన్న ఆయన పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల బరిలోకి దిగిన వెంటనే నీరజ్ ఝా అనారోగ్యం బారినపడ్డారు. మందులు వేసుకుంటూ ప్రచారం చేశాడు.
ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత చికిత్స కోసం మధుబనికి మొదట తీసుకువచ్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో పాట్నా ఎయిమ్స్ లో చేర్చారు. చివరకు ఆయన నేడు తుది శ్వాస విడిచాడు.
కరోనాతో గత పదిరోజులుగా ప్రచారానికి దూరంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం మరణించాడు. బీహార్‌లో కరోనా కారణంగా ఇప్పటివరకు తొమ్మిది మంది నాయకులు మరణించారు. ఇటీవల, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు , అరియారియా జిల్లాలోని సిక్టీ విధానసభ అభ్యర్థి విజయ్ కుమార్ యాదవ్ కూడా కరోనాతో మరణించడం విషాదం నింపింది.