కేసీఆర్‌ పై జీవ‌న్ రెడ్డి పంచ్ అదిరిందిగా!

Update: 2017-04-27 05:19 GMT
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుపై టీ కాంగ్రెస్ కీల‌క నేత జీవ‌న్ రెడ్డి నిన్న సంచ‌ల‌న విమ‌ర్శ చేశారు. మాకందుకుంటే... నాన్ స్టాప్‌గా పంచ్ ల మీద పంచ్‌లేసే కేసీఆర్‌ ను ఆయ‌న ఏకంగా మూగోడిగా అభివ‌ర్ణించేశారు. స‌రిగ్గా టీఆర్ ఎస్ 16 ఆవిర్భావ వేడుక‌ల‌కు ఓ రోజు ముందుగా జీవ‌న్ రెడ్డి చేసిన ఈ విమ‌ర్శ నిజంగానే టీఆర్ ఎస్ నేత‌ల‌కు మంట పుట్టించేదేన‌ని చెప్పాలి. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ది ఉత్స‌వాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా నిన్న‌ జ‌రిగిన కార్య‌క్ర‌మాన్ని వేదిక‌గా  చేసుకున్న జీవ‌న్ రెడ్డి... కేసీఆర్‌ పై అదిరిపోయే రీతిలో ఈ సెటైర్ వేశారు.

ఓయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల ప్రారంభానికి హాజ‌రైన రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ... పైలాన్‌ ను ఆవిష్క‌రించ‌డంతో పాటు విద్యార్థుల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌సంగం చేశారు. అంతేకాకుండా ఓయూ గొప్ప‌త‌నాన్ని కూడా ఆయ‌న కీర్తించారు. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ తో పాటు తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ కూడా హాజ‌ర‌య్యారు. అయితే ఈ వేదిక మీద గ‌వ‌ర్న‌ర్ గానీ, కేసీఆర్ గానీ ప్ర‌సంగించ‌లేదు. ఇదే విష‌యాన్ని ఆస‌రా చేసుకుని జీవ‌న్ రెడ్డి... కేసీఆర్‌ పై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావ‌డానికి జ‌రిగిన ఉద్య‌మంలో ఓయూ విద్యార్థుల పాత్ర మ‌రువ‌లేనిద‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు. ఓయూ విద్యార్థుల చైత‌న్యంతోనే కేసీఆర్ ఉద్య‌మాన్ని పీక్ స్టేజీకి తీసుకెళ్ల‌గ‌లిగార‌ని కూడా ఆయ‌న అన్నారు.

నాడు ఓయూకు వ‌చ్చిన కేసీఆర్ చేసిన ప్ర‌సంగాల‌ను ప్ర‌స్తావించిన జీవ‌న్ రెడ్గి... మూడేళ్ల త‌ర్వాత ఓయూ ప్రాంగ‌ణంలో అడుగుపెట్టిన కేసీఆర్ మూగోడిగా ఎందుకు తిరిగి వ‌చ్చార‌ని ప్ర‌శ్నించారు.  ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు ఓయూ విద్యార్థులు చేసిన ప్రాణ త్యాగాల‌ను రాష్ట్ర‌ప‌తికి వివ‌రించాల్సిన కేసీఆర్‌... ఎందుకు సైలెంట్‌ గా ఉండిపోయార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. విద్యార్థులంటే కేసీఆర్‌ కు భ‌యం ప‌ట్టుకుంద‌ని, ఆ కార‌ణంగానే విద్యార్థుల బ‌లిదానాల‌పై మాట్లాడ‌కుండానే ఓయూ నుంచి మూగోడిలా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని జీవ‌న్ రెడ్డి ఆరోపించారు. మ‌రి జీవ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు ఏ రీతిన స్పందిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News