ఎవరిపైనైనా నిర్మొహమాటంగా, నేరుగా విమర్శలు చేసే టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక్కసారిగా షాకిచ్చాయి. కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో చెబుతూ అందుకు చంద్రబాబును ఆయన కారణంగా చూపడంతో ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయంగా మారిపోయాయి. ఎన్టీఆర్ కు ఎంతమంది కొడుకులున్నా కూడా అల్లుడు చంద్రబాబు వారందరినీ కాదని అధికారం దక్కించుకున్నారని... ఇప్పుడు కేసీఆర్ కూడా తనకూ అలాగే జరుగుతుందేమోనని భయపడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిగ్గా మారాయి.
హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో ఈ రోజు టీపీసీసీ నేతలు గవర్నరు నరసింహన్ ను కలిసి కేసీఆర్ చేపడుతున్న కొత్త సచివాలయ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపారు. కొత్త సచివాలయాన్ని నిర్మించకూడదని విన్నవించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వాస్తుని కారణంగా చూపిస్తూ దురుద్దేశంతోనే తెలంగాణ సర్కారు సచివాలయ భవనాల్ని కూలగొడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ సచివాలయంలో పాలన కొనసాగిస్తే సీఎంల కుమారులు మళ్లీ సీఎంలు కావడం లేదని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు.
ఎన్టీఆర్ కుమారుడు కాకుండా అల్లుడు చంద్రబాబు సీఎం అయ్యాడని, ఇప్పుడు కేటీఆర్ సీఎం కాకుండా హరీశ్ రావు సీఎం అవుతాడనే కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే సచివాలయాన్ని కూలగొడుతున్నారని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/