కేసీఆర్ ఆ వీడియోలు ఎందుకు దాచేశారు?

Update: 2016-12-31 05:40 GMT
గ్యాంగ్ స్ట‌ర్ న‌యీంకు రాజ‌కీయనేత‌లు - పోలీసుల‌తో సంబంధం లేద‌ని హైకోర్టులో తెలంగాణ ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డం అధికార టీఆర్ ఎస్ పార్టీని ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను ఇర‌కాటంలో ప‌డేస్తోంది. ఇన్నాళ్లు ఈ అంశం ఆధారంగా త‌మ‌ను టార్గెట్ చేసిన కేసీఆర్‌ పై ఇపుడు కాంగ్రెస్ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. టీఆర్‌ ఎస్ నేతల బండారం బయటపడుతుందనే నయీం కేసును ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండే సిట్‌చే విచారణ జరిపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విమర్శించారు. కేసు విచారణను తన గుప్పిట్లో పెట్టుకునేందుకే సిట్‌ చే విచారణ జరిపిస్తానని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.

2015లో నయీం మేనకోడలు పెళ్లి విందుకు రాజకీయ నాయకులు హాజరయ్యారని చెప్పిన జీవ‌న్ రెడ్డి ఆ వీడియోలు ఎక్కడికి పోయాయో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరరూప రాక్షసుడిగా పేరొందిన నయీంతో సంబందాలు ఉన్న వారిని కాపాడేందుకు యత్నించడం సరికాదన్నారు.  నయీం ప్రధాన అనుచరుడి సంగతేమిటి,..? నయంంతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ నేతలు - ఐఏఎస్ - ఐపీఎస్‌ లకు ప్ర‌భుత్వ‌మే ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందా అని జీవ‌న్ రెడ్డి సూటిగా నిల‌దీశారు. టీఆర్‌ ఎస్ నేతలు - పోలీసులను కాపాడే ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలని సూచించారు. కాగా ...అన్ని పక్షాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన సభలో కూడా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని డీకే అరుణ ఆరోపించారు. ప్రజల సమస్యలపై చర్చించే అవకాశం ఇవ్వడం లేదని - స్పీకర్ ఏకపక్ష దోరణితో ప్రతిపక్ష సభ్యులకు అవకాశం లేకుండా పోతుందని వాపోయారు. చివరకు బీఏసీ ప్రధాన పక్షం ఇచ్చిన అంశాలను కూడా చర్చించేందుకు సమయం ఇవ్వడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రశ్నల్లో కూడా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. తనకు మైక్ ఇస్తే సీఎం బండారం బయటపెట్టేవాడిన‌ని కోమ‌టిరెడ్డి అన్నారు.

పార్టీలు మారిన వారికి ప్రాధాన్యం ఇస్తూ త‌మ‌కు నీళ్లు ఇవ్వకుండా ఎండబెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తికి 62వేల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి మాట తప్పిం
దని విమర్శించారు. గుత్తా సుఖేందర్ అడగ్గానే ఆయకట్టు ప్రజలను వదిలి ఆయకట్టులేని నల్లగొండ ప్రజలకు నీటిని దోచుకుపోతున్నారన్నారు. జూపల్లికి కృష్ణారావుకు చిత్తశుద్ది ఉంటే మాకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా అధికారపక్షం కంటే ప్రతిపక్షానికే సభలో ఎక్కువ సమయం కేటాయించిన‌ట్లు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన పనుల వల్ల 45 వేల చెరువులు నిండాయని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News