తెలంగాణ మంత్రి - తన మేనబావ హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఊహించని రిప్లై ఇచ్చింది. జగిత్యాల సభ సందర్భంగా తమ పార్టీపై విమర్శలు చేయడాన్ని కూడా హస్తం నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత టి.జీవన్ రెడ్డి మంత్రి కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. తెరాస నిర్వహిస్తున్న జనహిత బహిరంగ సభలు అధికార అహంకారంతో నిర్వహిస్తున్నట్లుగా ఉందని అన్నారు. ఈ సభల్లో అహంకార దర్పంతో కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఏమీ చేయకపోతే ... తెరాస సర్కార్ లక్షా నలభైతొమ్మిది వేల బడ్జెట్ ను ఎలా ప్రవేశపెట్టారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మూడు సంవత్సరాల పసిగుడ్డు తమ సర్కారు అని చెప్పుకుంటున్న కేటీఆర్ .. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఎలా వచ్చిందో తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పై ఎంపీగా పోటీ చేయడం వల్లే జీవన్ రెడ్డి మంత్రి కాగలిగాడని కేటీఆర్ మాట్లాడటం రాజకీయ అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. `నా రాజకీయ చరిత్ర ఏంటో మీ తండ్రి కేసీఆర్ ను అడుగు. చంద్రబాబు మంత్రిగా చేసివుంటే .. మీ తండ్రి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేవాడా? నేను తెరాస కండువా కప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచానని చెబుతున్న కేటీఆర్ .. మీ తండ్రి కేసీఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎంపీగా గెలవలేదా? కాంగ్రెస్ తో పొత్తుతో ఎన్ని సీట్లకు పోటీ చేసి ఎన్ని సీట్లు గెలిచారో కేటీఆర్ గుర్తు చేసుకోవాలి. అధికార పార్టీ నాయకులుగా ఉండి తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన చరిత్ర మాది. కేటీఆర్ - కవితలు ఏనాడైనా జైలుకు వెళ్ళారా?` అని జీవన్ రెడ్డి ప్రశ్నల వర్షం గుప్పించారు.
ప్రాజెక్టులు కట్టే చిత్త శుద్ధి తెరాస సర్కార్ కు లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. పునరావాస ప్యాకేజీ లేకుండా రైతుల నుంచి భూములు గుంజుకుంటారా అని ప్రశ్నించారు. నిర్వాసితులు కోర్టుకు వెళ్ళితే .. కాంగ్రెస్ కేసులు వేసి ప్రాజెక్ట్స్ అపుతున్నారని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటే .. అధికారంలో ఉండి నైతికత ఈ ప్రభుత్వానికి లేదని తెలిపారు. అసెంబ్లీ రికార్డులను కేటీఆర్ వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని జీనవ్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ పై ప్రివిలేజ్ మోషన్ పెడతానని చెప్పారు.
మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ లోకి వస్తాడనే అనుమానం కేటీఆర్ కు ఎందుకు వచ్చిందో ఆయనే చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో నాయకులు తక్కువైయ్యారని హరీశ్ రావు కాంగ్రెస్ లోకి రావాలని కోరుతామా అని ప్రశ్నించారు. ఆయన ఏమైనా బాహుబలిగా కాంగ్రెస్ కు జీవం పోస్తారా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే ఓ బాహుబలి అని పేర్కొంటూ తమకు ఎవరి అవసరం లేదని జీనవ్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి కాపాడుకునేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు లైసెన్స్ లేని తలసాని .. మంత్రిగా ఉంటాడో .. ఉడుతాడో అయన కె తెలియదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/