హరీశ్ సవాలుకు జీవన్ రెడ్డి స్పందించారే

Update: 2015-11-13 12:20 GMT
వరంగల్ ఉప ఎన్నికల ఊపందుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం పూర్తిగా వేడెక్కిపోతోంది. తాజాగా.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడిన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఓడిపోతే.. పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేస్తారా? అని సవాలు విసరటం తెలిసిందే.

మంత్రి హరీశ్ సవాలుకు ఉత్తమ్ స్పందించలేదు కానీ.. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. హరీశ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండి పడిన ఆయన.. ప్రతిసవాలు విసిరారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణరాష్ట్ర సమితి అభ్యర్థి కానీ ఓడిపోతే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

హరీశ్ సవాలు విసిరితే.. ఉత్తమ్ స్పందించకుండా.. జీవన్ రెడ్డి స్పందించి.. కేసీఆర్ ను సీన్లోకి తీసుకురావటం గమనార్హం. రైతుల సమస్యల మీద కేసీఆర్ దృష్టి పెట్టాలని.. ఫామ్ హౌస్ ను విడిచిపెట్టి బయటకు రావాలంటూ మండిపడ్డారు. హరీశ్ సవాలుకు ఉత్తమ్ స్పందించకుండా జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మరి.. తాజాగా జీవన్ రెడ్డి ప్రతి సవాలుకు టీఆర్ఎస్ నేతలు ఎవరు రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News