ఎంత ధనవంతుడైనా.. సంపన్నుడైనా.. స్థాయికి మించి ఖర్చు పెడితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గమనిస్తున్నారా? లేదా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం అనుసరిస్తున్న వైఖరి పలువురిని భయాందోళనలకు గురి చేస్తోంది.
అరవైళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అప్పుల వాటాను కేవలం మూడున్నరేళ్ల వ్యవధిలో రెట్టింపు చేసిన ఘనత ఎవరైనా దక్కిందా? అంటే అది కేసీఆర్ సర్కారుకేనని చెప్పాలి. అప్పు చేసి పప్పు కూడు మాదిరి.. చేస్తున్న అభివృద్ధి.. కనిపిస్తున్న మార్పు మొత్తం అప్పుల భారంగా రాష్ట్రం నెత్తిన ఉందన్న విషయం అర్థమైతే ఆందోళన కలగటం ఖాయం.
మొన్నామధ్య అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే అతి చెత్త సచివాలయంగా అనేశారు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. కానీ.. సచివాలయం విషయంలో మాత్రం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే.. ఆయన పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ సచివాలయానికి ప్లాన్ చేశారు మరి. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడమని ఆయనే చెప్పేశారు.
మహా అయితే.. నాలుగైదు వందల కోట్లు అవుతాయని.. తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రం ఆ మాత్రం ఖర్చు మోస్తుందన్నట్లుగా ఆయన చెప్పుకున్నారు. కేసీఆర్ చెప్పిన ధీమా మాటలో నిజం ఎంతన్నది అప్పుల అంకెలు చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. గుండెలు అదిరేలా తెలంగాణ అప్పు రోజురోజుకి పెరిగిపోతున్న వైనం భయాందోళనలకు గురి చేస్తుందని చెప్పాలి.
అప్పులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లు చెప్పినప్పటికీ.. వాటి ద్వారా వచ్చే ఆదాయం అప్పు మీద వడ్డీ కట్టేందుకు అనువుగా లేకుంటే ఎలా? అన్న ప్రశ్నకు అధికార పక్షానికి చెందిన వారి నుంచి సంతృప్తికర సమాధానం రాని పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలంగాణ అప్పుల లెక్కకు సంబంధించి ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన మూడున్నరేళ్లలో అప్పుల భారం రెట్టింపు అయ్యిందని.. జాతీయస్థాయిలో అప్పుల పెరుగుదల 33 శాతం ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అది కాస్తా 71 శాతానికి మించి ఉందన్నారు. దేశంలో అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్ర తలసరి అప్పుల భారం రూ.40వేలుగా ఉందన్నారు.
ఇదే రీతిలో అప్పులు చేసుకుంటూ పోతే 2018 చివరి నాటికి పుట్టబోయే బిడ్డకు సైతం రూ.80వేల అప్పు ఉండటం ఖాయమన్నారు. అప్పుల తిప్పల నుంచి తప్పించుకోవటానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సంపన్న రాష్ట్రం.. ధనిక రాష్ట్రం అంటూ చివరకు ఇంత భారీగా అప్పులు పెంచేయటం ఏమైనా న్యాయంగా ఉందా కేసీఆర్? కలల ప్రపంచాన్ని చూపించే మాటల వెనుక ఇంత అప్పు కుప్ప ఉండటం న్యాయమేనా?