సినిమాలు మానేశానని.. తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు - ప్రముఖ సినీ నటులు జీవితా రాజశేఖర్ ప్రశ్నల వర్షం కురిపించారు. తన దగ్గర ఆస్తులు లేవని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కు మూడేళ్ల నుంచి పార్టీ నడపడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి.? ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ మేనిఫెస్టోలో క్లారిటీ లేదని.. ఆయనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా క్లారిటీ లేదని.. ఈ విషయంలో ప్రజలకు వివరణ ఇవ్వాలని జీవితా రాజశేఖర్ డిమాండ్ చేశారు. పారదర్శకతకు పెద్దపీట అంటున్న పవన్ కళ్యాణ్ కు కోట్ల రూపాయల డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో చెబితే బాగుంటుందని వారు సూచించారు. ముఖ్యమంత్రి తానే అవుతానంటున్న పవన్ 65 స్థానాల నుంచి మాత్రమే ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు. ఇంత తక్కువ సీట్లలో పోటీచేస్తే సీఎం ఎలా అవుతావని.. జీవితా రాజశేఖర్ ప్రశ్నించారు.
సినిమాకు 30 కోట్లు తీసుకునే పవన్ ఆ స్థాయిని వదిలి ప్రజలకు సేవ చేస్తానని వచ్చాడని.. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఆయన మాట ఇచ్చినట్టు ఒంటరిగా నిలబడాలని జీవితా రాజశేఖర్ సవాల్ విసిరారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీతో కలిసినా.. మద్దతిచ్చినా చాలా ఛండాలంగా ఉంటుందని జీవితా రాజశేఖర్ ఎద్దేవా చేశారు.
జగన్ ముఖ్యమంత్రి అవుతారని.. పవన్ - చంద్రబాబుకు అర్థమైందని.. అందుకే ఆ విషయాన్ని జీర్నించుకోలేక అప్పటి నుంచి జగన్ పై విమర్శలు చేస్తున్నారని జీవితారాజశేఖర్ మండిపడ్డారు. పవన్ తోపాటు తెలుగుదేశం నేతలంతా జగన్ ను విమర్శించడానికి కారణం ఇదేనని వారు స్పష్టం చేశారు.