ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పంట పండింది. ఒక్కరోజులోనే ఆయన ప్రపంచ కుబేరుల్లో రెండోస్థానానికి దూసుకెళ్లారు. బుధవారం అమెజాన్ షేరు ఏకంగా 18.32 డాలర్లు పెరగడంతో.. బెజోస్ ఒక్క రోజులోనే 150 కోట్ల డాలర్లు (సుమారు రూ.9700 కోట్లు) ఆర్జించారు. ఈ లాభాలతో ఆయన అమన్సియో ఓర్టెగా, వారెన్ బఫెట్ లను వెనక్కి నెట్టి రెండోస్థానానికి ఎగబాకారు. దుబాయ్ లో ఉన్న తమ అనుబంధ సంస్థ సౌక్.కామ్ ను అమ్మేయనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే అమెజాన్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
ప్రస్తుతం బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ జాబితాలో 75.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4 లక్షల 87 వేల కోట్లు) సంపదతో బెజోస్ రెండోస్థానంలో ఉన్నారు. బెజోస్ సంపద మూడోస్థానంలో ఉన్న వారెన్ బఫెట్ కంటే 70 కోట్ల డాలర్లు, నాలుగోస్థానంలో ఉన్న ఓర్టెగా కంటే 130 కోట్ల డాలర్లు ఎక్కువ. ఏడాది కాలంలో అమెజాన్ వ్యవస్థాపకుని సంపద వెయ్యి కోట్ల డాలర్లు పెరగడం విశేషం. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచే 700 కోట్ల డాలర్లు బెజోస్ ఖాతాలో చేరాయి. ఇప్పటికీ 8600 కోట్ల డాలర్ల (సుమారు రూ.5 లక్షల 58 వేల కోట్లు) సంపదతో బిల్ గేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/