టీమిండియా ఓట‌మిపై మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌

Update: 2019-07-01 06:06 GMT
వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో టీమిండియా జైత్ర‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కూ ఓట‌మి ఎరుగ‌ని టీమిండియా ఇంగ్లండ్ జ‌ట్టు చేతిలో ఓడిపోవ‌టంపై అభిమానులు తీవ్ర‌మైన ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఓట‌మికి కార‌ణం.. టీమిండియా వేసుకున్న ఆరెంజ్ జెర్సీ కూడా కార‌ణంగా చెబుతున్నారు.

మెన్ ఇన్ బ్లూ కాస్తా.. మెన్ ఇన్ ఆరెంజ్ గా మార‌టంతో అచ్చిరాలేద‌న్న‌ట్లుగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి మొహ‌బూబా ముఫ్తీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

అసంబ‌ద్ధంగా చెబుతున్నాన‌ని మీరు న‌న్ను అనుకోవ‌చ్చు కానీ.. వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ విజ‌యాల‌కు బ్రేక్ ప‌డ‌టానికి కార‌ణం వారు ధ‌రించిన ఆరెంజ్ జెర్సీ కూడా ఒక కార‌ణం అంటూ ట్వీట్ చేశారు. ఆరెంజ్ జెర్సీ మీద ఇప్ప‌టికే వివాదం న‌డుస్తున్న వేళ‌.. మాజీ ముఖ్య‌మంత్రి ఒక‌రు టీమిండియా ఓట‌మికి జెర్సీతో ముడి పెట్ట‌టం గ‌మ‌నార్హం.  

ఇంగ్లండ్ తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియా 31 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలు కావ‌టం వెనుక మెన్ ఇన్ ఆరెంజ్ కూడా కార‌ణ‌మ‌న్న మాట ప‌లువురి నోట‌వినిపిస్తున్న వేళ‌.. ఆ వాద‌న‌కు బ‌లం చేకూరేలా జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒక‌రు ఇదే అంశాన్నిత‌న ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిరంగా మారింది. ఆరెంజ్ జెర్సీ బీజేపీకి గుర్తుగా ప‌లువురు వ్యాఖ్యానించ‌టం తెలిసిందే. 
Tags:    

Similar News