సంచలన ఆరోపణలు చేశారు ఓట్లకు నోట్ల కేసులోని ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి.. ఒకప్పుడు ఆ పార్టీలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించిన అతడు.. ఓట్లకు నోట్ల కేసులో అప్రూవర్ గా మారినందుకు తనను చంపేందుకు కుట్ర సాగుతుందన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది ఓట్లకు నోట్ల కేసు గురించి తెలిసిందే. ఈ కేసులో సూత్రధారులు చంద్రబాబు.. రేవంత్ రెడ్డిలేనని.. ఈ కేసు పూర్తి అయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని కోరారు. తన మీద జరుగుతున్న కుట్రకు తగ్గట్లే తాజాగా ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఒకప్పుడు బాబు.. రేవంత్ ల పక్షాన ఉన్నమత్తయ్య తర్వాతి కాలంలో వారిపైన సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. తాజాగా మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించటం.. బాబు..రేవంత్ లపైన తీవ్ర ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. అంతేకాదు.. రేవంత్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.