క్రైస్తవుల మనోభావాల్ని కెలకటమేంటి తస్లీమా?

Update: 2015-12-25 06:40 GMT
కొన్ని అంశాల్లో ఏది నిజం.. ఏది అబద్ధమని స్పష్టంగా తేల్చి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. చరిత్ర పొరల్లో కప్పబడి పోయిన విషయాలకు సంబంధించిన అంశాల్ని బయటకు తీసి.. వాటిపై చర్చ పెట్టటం అనవసరమైన వ్యవహారం. అదే సమయంలో కొందరి నమ్మకాలపై ఘాటైన విమర్శలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం కూడా తక్కువే. అంతే కాదు.. కోట్లాది మంది నమ్మే అంశాల్ని ప్రశ్నించటం ఒక ఇబ్బంది అయితే.. తాము చేసే వ్యాఖ్యలకు శాస్త్రీయ సమర్థతను చూపించుకోలేకపోవటం ఓ పెద్ద లోపం అవుతుంది. ఎవరూ అడగకుండానే.. తన అభిప్రాయం అంటూ అనవసరమైన వివాదాన్ని తట్టి రేపటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ప్రముఖులకే తెలియాలి. ఇలాంటి వాటి వల్ల లేనిపోని ఉద్రిక్తతలు పెరగటం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని గాయపరిచేలా మాట్లాడే ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు. తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు.

క్రిస్మస్ కు ఒక రోజు ముందు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె చేసిన ట్వీట్స్ పై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది క్రైస్తవ భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఆమె వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రపంచంలోని క్రైస్తవ సమాజం దేవుని బిడ్డగా భావించే ఏసుక్రీస్తు గురించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కీస్తు దేవుని బిడ్డ కాదనేశారు. అబద్దాలపై జరిగే క్రిస్మస్ వేడుకులకు తాను దూరమని.. క్రీస్తు తల్లి మేరీమాత ముమ్మాటికి కన్య కాదని.. క్రీస్తు దేవుని బిడ్డ కాదని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్రంగా ఖండిస్తుంటే.. మరికొందరు తస్లీమా ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తస్లీమాను సమర్థించే వారు.. వారి నమ్మకాలపై ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చేస్తే...
Tags:    

Similar News