చదువుకుంటున్న రోజుల్లో తాను జెట్ ఎయిర్ వేస్ సంస్థలో ఉద్యోగం చేయాలని కోరుకున్నానని.. అయితే మంచి శరీరదారుఢ్యం లేదన్న కారణంతో తనకు ఉద్యోగం ఇచ్చేందుకు ఆ సంస్థ నిరాకరించిందని.. ఉద్యోగం వచ్చివుంటే తాను కేంద్రమంత్రి అయ్యే అవకాశం వచ్చిఉండకపోవచ్చని చెబుతున్నారు స్మృతి ఇరానీ. తన కెరీర్ ఎలా మొదలైంది, తానేమి కోరుకున్నాను - చివరికి ఎలా జరిగింది అనే విషయాలపై కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇలా జెట్ ఎయిర్ వేస్ లో కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో - మెక్ డొనాల్డ్ సంస్థలో చేరారని చెబుతున్నారు స్మృతి ఇరానీ. అప్పుడు ఉద్యోగం రాకపోయిన సమయంలో చాలా బాదపడినా... తనకు ఉద్యోగం రానందుకు ఇప్పుడు మాత్రం దేవుడికి ధన్యవాదాలు తెల్పుకుంటున్నానని చెబుతున్నారు. ఇక మెక్ డొనాల్డ్ సంస్థ లో ఉద్యోగం అనంతరం చరిత్రంతా మీ అందరికీ తెలుసునని స్మృతి ఇరానీ అన్నారు. టీవీ నటిగా పేరు సంపాదించిన ఆమె తర్వాతికాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి అయిన సంగతి తెలిసిందే.
కాగా... మొన్నటివరకూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ పట్టాలు ఫేక్ అని, వాటిని పరిశీలించాలని ఆమేర్ ఖాన్ అనే ఫ్రీలాన్స్ రచయిత ల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కూడా స్మృతి నకిలీ సర్టిఫికెట్లు పొందారన్న ఆరోపణలపై విచారణ చేయాలని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే!