దేవుడిగా మోడీ...గుజ‌రాత్‌ లో పూజ‌లు

Update: 2018-11-06 01:30 GMT
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి త‌న ఇలాకా అయిన గుజ‌రాత్‌ లో ఊహించ‌ని గౌర‌వం ద‌క్కుతోంది. ఇటీవ‌లే స‌ర్దార్ ప‌టేల్ భారీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి గుజ‌రాత్ గౌర‌వాన్ని మ‌రింత పెంచిన మోడీకి తాజాగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు కొత్త గౌరవాన్ని అందిస్తున్నారు. మోడీని గుజరాత్ ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారు. ప్రతి ఏడాది దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవీకి పూజ చేసినట్లు ఈ ఏడాది మోడీ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ వేడుక‌ల‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్  మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

గుజరాత్‌ లో దీపావళి పండుగలో భాగంగా దంతేరాస్ అనే వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేకంగా బంగారం - వెండి కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే ఈ ఏడాది సూరత్‌ కు చెందిన ఓ బంగారం దుకాణ యజమాని.. గోల్డ్ - సిల్వర్ బార్ల పై మోడీ ప్రతిమలను అచ్చు వేయించాడు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉండడంతో వందలాది మంది ఇప్పటికే కొనుగోలు చేశారు. దేశాభివృద్ధి - సంక్షేమం కోసం మోడీ నిరంతరం శ్రమిస్తున్నందుకు గుర్తుగా గోల్డ్ బార్ల పై మోదీ ప్రతిమను అచ్చు వేయించినట్లు దుకాణ యజమాని చెప్పారు. కాగా - బంగారంపై మోడీ ప్రతిమను అచ్చు వేయడం ఇదే మొదటిసారి కాదు. రాఖీ పండుగను పురస్కరించుకొని ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని మోడీ - యూపీ సీఎం యోగి - గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రతిమలను అచ్చు వేసిన విషయం విదితమే.
Tags:    

Similar News