బీజేపీ ఎంపీ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా..ఎందుకంటే?

Update: 2020-08-08 11:50 GMT
జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం దావాలో సోరెన్‌ పొందుపరిచారు. దీనిపై రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఇందులో బీజేపీ ఎంపీతో పాటు ట్విట్ట‌ర్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియాల‌ను కూడా చేర్చారు.

సీఎం హేమంత్ సోరెన్ పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా ఆత్యాచార ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని ట్వీట్ చేశారు. తన పరువును దెబ్బ తీసేలా జులై 27న సోషల్ మీడియాలో దూబే ఆరోపణలు చేశారని సీఎం తెలిపారు. తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ట్విటర్, ఫేస్ బుక్ తొలగించలేదని, దీనితో వారిని కూడా పార్టీలుగా చేర్చానని సీఎం వెల్లడించారు. ఈ పరువు నష్టం దావాను ఆగస్టు 4న వేయగా కోర్టు ఆగస్టు 5న వాదనలు వింది. కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.

అయితే, ఒకవైపు సీఎం ప‌రువున‌ష్టం దావా వేసినప్పటికీ కూడా , ఆ బీజేపీ ఎంపీ అంత సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ ఎంపీ సీఎం పై విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. మీపై ముంబైలో ఒక యువతి రేప్‌ చేశారంటూ ఫిర్యాదు చేసింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి. ఏది ఏమైనా సరయూ రాయ్‌లాగా ఒక సీఎంతో పోరాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు.
Tags:    

Similar News