మన సాంప్రదాయం ప్రకారం, ఆనవాయితీల ప్రకారం సాధారణంగా మరణించిన వారి ఫోటోలను గోడకు తగిలించుకుని వారికి దండేసి, బొట్టుపెట్టి, అగరబత్తీలు వెలిగించి, కొబ్బరి కాయలు కొట్టడం వంటివి చేస్తుంటారు. బ్రతికున్న మనిషి ఎంత గొప్పవాడైనా ఇలాంటి కార్య్క్రమాలు చేయరు! కారణం ఇలా చేస్తే కచ్చితంగా అశుభం అని మనవాళ్ల నమ్మకం! ఈ విషయం తెలుసో తెలియదొ కానీ... లేక అబ్దుల్ కలాం లేరని అనుకున్నారో కానీ... వారి లోకజ్ఞానానికి పనిచెబుతూ బ్రతికున్న కలాం ఫోటోకి దండేసి, కొబ్బరికాయ పెట్టి, బొట్టు పెట్టేసి... నివాళులు అర్పించినంత సీన్ క్రియేట్ చేశారు!
వివరాళ్లొకి వెళితే... జార్ఖండ్ లోని కోదర్మ జిల్లాలోని ఒక పాఠశాలలో విద్యాశాఖామంత్రి నీరా యాదవ్ స్మార్ట్ క్లాసులను ప్రారంభించ్మారు. ఈ సందర్భంగా ఆమె అక్కడున్న అబ్దుల్ కలాం ఫోటోకు దండేసి, హారతి వెలిగించారు. దీంతో అక్కడున్న పిల్లలు సైతం షాకయ్యారు. సాక్ష్యాత్తు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ మాత్రం లోకజ్ఞానం లేదా అని విమర్శలు గుప్పించారు! మరో విషయం ఏమిటంటే... నిత్యం హిందూ ధర్మం గురించి, భారతీయూల సంప్రదాయాల గురించి మాట్లాడే బీజేపీ ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ తంతంతా జరిగింది!
ఈ వ్యవహారం దేశమంతా పాకేసింది. దీంతో ఈ మంత్రిగారు స్పందించి... తన తెలివికి పనిపెట్టి మాట్లాడారు! అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త అనీ, అలాంటి గొప్ప వ్యక్తికి దండేసి దండంపెడితే తప్పేమిటని, అది కేవలం గౌరవం మాత్రమే అని... తనదైన రాజకీయ శైలిలో సమర్ధించుకున్నారు! ఈ మంత్రిగారి తెలివితేటలకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని... ఈవిడ ఫోటోకి కూడా దండేసి దండంపెట్టాలని నెటిజన్లు విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు!