ప్రజా జీవితంలో ఉన్న వారికి వ్యక్తిగతం పవిత్రంగా ఉండాలి. కనీసం అలా ఉన్నట్లుగా కనిపించాలి. దేన్ని బాహాటం చేసుకోకూడదు. ఒక వేళ ఖర్మ రివర్స్ అయితే దానికి భారీగా రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది గతంలో ఎంతో మంది విషయంలో రుజువు అయింది. అయినా అధికారం మత్తులో మననెవరూ అసలు టచ్ చేయలేరని, ఏమీ చేయలేరని కొంతమంది కులాసాగా ధిలాసగా ఉంటారు. అపుడే ఠక్కున దొరికేస్తారు.
అలా జార్ఖండ్ కి చెందిన ఒక మంత్రి గారు అడ్డంగా బుక్ అయ్యారు. ఆయన ఒక మహిళతో రాసలీలల వీడియో బయటకు వచ్చింది. ఆ మంత్రి గారి పేరు బన్నా గుప్తా. ఆయన ఒక వీడియో కాల్ లో మహిళతో చిలిపిగా మాట్లాడుతూ దొరికేశారు. దీన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ మంత్రి గారి గుట్టు విప్పేశారు.
కాంగ్రెస్ మహిళల పట్ల చూపించే గౌరవం ఇదని బీజేపీ ఎంపీ విమర్శించారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడంతో పాటు మహిళలతో మంత్రి ఆడుకుంటున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. నిజానికి ఇది కాంగ్రెస్ అసలైన స్వరూపం అని ఘాటుగా కామెంట్స్ చేశారు.
దీని మీద జార్ఖండ్ సీఎం హేమంత్ వెంటనే దర్యాప్తు చేయించాలని కూడా బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. అయితే ఇదంతా కట్టు కధ అని ఎడిట్ చేసిన వీడియో అని సదరు మంత్రి గారు అంటున్నారు. తన మీద కుట్ర చేయడానికే ఆ ఎడిటెడ్ వీడియోను జనం ముందు పెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే మంత్రి అందులో మాట్లాడింది, అవతల వీడియో లో ఒక మహిళ ఉన్నది ఆమె మాటలు ఈయన గారి మాటలు స్పష్టంగా వినిపిస్తునాయి, అంతా కనిపిస్తోంది.
అయినా సరే ఇదంతా కూడా మార్ఫింగ్, ఎడిటింగ్ అని మంత్రి గారు అంటున్నారు అంటే జార్ఖండ్ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే అసలు విషయం ఏంటో బయటకు వస్తుంది అని అంటున్నారు. సరిగ్గా కర్నాటక ఎన్నికల వేళ ఈ వీడియో బయటకు రావడం విశేషం. మరి ఇది కాకతాళీయమా లేక రాజకీయమా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. ఇపుడు కాంగ్రెస్ దీన్ని ఎలా తీసుకుంటుంది అన్నది కూడా చర్చగా ఉంది.