మోడీకి ఎవ‌రైనా ఐల‌వ్యూ చెప్పారా?

Update: 2018-02-14 11:50 GMT
వాలంటైన్స్ డే సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఓ వింత ప్రశ్న ఎదురైంది. గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవానీ ప్రధాని మోడీకి ఆనూహ్య‌మైన ప్ర‌శ్న సంధించారు. `నాకు చాలా మంది ఐ లవ్ యు చెప్పారు. కానీ మోడీకి ఎప్పుడైనా ఎవరైనా ఐ లవ్ యు చెప్పారా లేదా అన్నది నా డౌట్. హ్యాపీ వాలెంటైన్స్ డే` అంటూ మేవానీ ట్వీట్ చేశారు.  వాలెంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్‌ లో మేవానీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.

మేవానీ ఇక్క‌డితోనే ఆగిపోలేదు. మళయాల నటి ప్రియా ప్రకాశ్ వైరల్ సాంగ్‌ పైనా ట్వీట్ చేస్తూ.. దానినీ ఆరెస్సెస్‌ కు లింకు పెట్టారు. ఆరెస్సెస్ నిరసనల కంటే ప్రజలు ఈ సాంగ్‌నే ఎక్కువగా ఇష్టపడ్డారని, దీనిని బట్టి ఇండియన్స్‌ కు ద్వేషం కంటే ప్రేమే ఎక్కువని మరోసారి నిరూపితమైందని మేవానీ ట్వీట్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా భ‌జరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమ జంటలను వేధిస్తున్న సమయంలో మేవానీ ఈ ట్వీట్లు చేయడం గమనార్హం.

మ‌రోవైపు ప్ర‌ధాని మోడీ సంస్క‌ర‌ణ‌పై నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీమ్ అంటూ బడ్జెట్‌ లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ తమకు అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటికే తమ రాష్ట్రంలో 50 లక్షల మందికి స్వాస్త్య సాథి కార్యక్రమంలో భాగస్వాములయ్యారని, మోడీ కేర్ తమకెందుకని సీఎం మమతా బెనర్జీ అన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నుంచి తప్పుకున్న తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. `కేంద్రం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ లో 40 శాతం రాష్ర్టాలు భరించాలి. కానీ మాకు ఇప్పటికే ఓ కార్యక్రమం ఉన్నపుడు మరోదానిపై ఎందుకు ఖర్చు చేయాలి?` అని మమతా ప్రశ్నించారు. గత సీపీఎం ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పులపాలు చేసినా ఈ కార్యక్రమాన్ని తాము సమర్థంగా అమలు చేస్తున్నామని ఆమె స్పష్టంచేశారు. అసలు ఈ స్కీమ్ గురించి చెప్పిన మరుసటి రోజే.. ఇది కేవలం పేపర్లకే పరిమితయ్యేదని మమత అన్నారు.
Tags:    

Similar News