జియో..ఇంకో దుమ్మురేపే ఆఫ‌ర్‌

Update: 2017-04-12 05:35 GMT
కేవ‌లం పాజిటివ్ వార్త‌లు - వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్లాన్‌ ల‌తో స‌మాచారంతోనే తెర‌మీద‌కు వ‌స్తున్న రిల‌య‌న్స్ జియో తాజాగా అలాంటిదే మ‌రో తీపి క‌బురు అందించింది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఆదేశాల మేరకు మూడు నెలల కాంప్లిమెంటరీ సమ్మర్ సర్‌ ప్రైజ్ ఆఫర్‌ ను ఉపసంహరించుకున్న రిలయన్స్ జియో.. ప్రైమ్ మెంబర్ల కోసం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ధన్ ధనా ధన్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌ లో భాగంగా ప్రైమ్ యూజర్లు రూ.309తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజులపాటు రోజుకు ఒక జీబీ 4జీ డాటా లభిస్తుంది. రూ.509తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజులపాటు రోజుకు 2 జీబీ 4జీ డాటా పొందవచ్చు.

ఈ రెండు ఆఫర్లలోనూ దేశీయంగా అపరిమితంగా ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. అయితే, ఈ రీచార్జ్ కేవలం ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుందని, సమ్మర్ సర్‌ ప్రైజ్ ఆఫర్‌ తోపాటు ఈ పథకాన్ని పొందలేరని సంస్థ స్పష్టం చేసింది. ఇంకా ప్రైమ్ మెంబర్‌ షిప్‌ లో చేరని జియో కస్టమర్లు గనుక ధన్ ధనా ధన్ ఆఫర్‌ ను పొందాలనుకుంటే.. ఎంచుకునే రీచార్జ్ ప్యాక్‌ కు రూ.99 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు ఒక జీబీ డాటా ఆఫర్ కోసం రూ.408 (రూ.309+ రూ.99), రోజుకు 2జీబీ డాటా ఆఫర్ కోసమైతే రూ.608 (రూ.509+రూ.99) అవుతుంది. మూడు నెలల కాంప్లిమెంటరీ ఆఫర్‌లో చేరలేకపోయిన వారికోసమే సంస్థ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది. నిబంధనలకు అనుగుణంగా లేదన్న కారణంగా సమ్మర్ సర్‌ ప్రైజ్ ఆఫర్‌ ను ఉపసంహరించుకోవాలని రిలయన్స్ జియోను ట్రాయ్ ఆదేశించింది. అందుకు అనుగుణంగా కంపెనీ ఆఫర్‌ ను ఇప్పటికే విత్‌ డ్రా చేసుకుంది. ఈ ఆఫర్‌ లో భాగంగా ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న సంస్థ యూజర్లు రూ.303తో రీచార్జ్ చేసుకుంటే కాంప్లిమెంటరీగా 3 నెలల పాటు సేవలు పొందవచ్చు. అంటే, ఒక నెల రీచార్జ్‌ తో మూడు నెలలపాటు సేవలు పొందవచ్చన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News