ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ లో అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగిపోతుందనే వార్తలు వినిపిస్తున్న తరుణం లో.. ఆ కథనాల కు బలం చేకూరుస్తూ ఆ పార్టీ తెలంగాణ నాయకులు స్వేచ్ఛగా రియాక్ట్ అవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ నేతలు తమ అభిప్రాయాల ను ఆన్ లైన్ వేదికగా వెల్లడిపరుస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మరోమారు స్పందించారు.
అవును... ఇటీవల బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దున్నపోతు ను తన్నుతూ ఓ ట్రక్కులో ఎక్కిస్తున్న వీడియో ట్వీట్ చేసిన ఆయన... "తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ఈ ట్రీట్ మెంట్ అవసరం" (This treatment is what's required for Bjp Telangana leadership.) అంటూ వ్యాఖ్యనించారు. ఈ ట్వీట్ ను బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బి.ఎల్.సంతోష్, సునీల్ బన్సల్ కు ట్యాగ్ చేశారు.
దీంతో ఈ ట్వీట్ పెద్ద దుమారమే లేపింది! దీంతో ఆయన మరో ట్వీట్ చేశారు. "తన అభిప్రాయాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేవాళ్లకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశాను" అని ఆయన పేర్కొన్నారు. దీంతో... "నాయకులు (Leaders), నాయకత్వం (Leadership) లకున్న తేడా జితేందర్ రెడ్డికి తెలియకపోతే అది జనం తప్పా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
అనంతరం.. తాజాగా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ విషయం లో కూడా జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రఘునందన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆవేదన చెందిన వీడియోని పోస్ట్ చేసిన జితేందర్... రఘునందన్ ని జాతీయ అధికార ప్రతినిధి చేయాల ని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో.. ఈ ట్వీట్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ లో కీలక మార్పుల కు పార్టీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుడుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో త్వరలో కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు జి.కిషన్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించనుందని ఊగాహాణాలు వెలువడుతున్నాయి! ఈ సమయం లో సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్ల పై జితేందర్ ఇలాంటి ట్వీట్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది.Full View
Full View Full View
అవును... ఇటీవల బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దున్నపోతు ను తన్నుతూ ఓ ట్రక్కులో ఎక్కిస్తున్న వీడియో ట్వీట్ చేసిన ఆయన... "తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ఈ ట్రీట్ మెంట్ అవసరం" (This treatment is what's required for Bjp Telangana leadership.) అంటూ వ్యాఖ్యనించారు. ఈ ట్వీట్ ను బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బి.ఎల్.సంతోష్, సునీల్ బన్సల్ కు ట్యాగ్ చేశారు.
దీంతో ఈ ట్వీట్ పెద్ద దుమారమే లేపింది! దీంతో ఆయన మరో ట్వీట్ చేశారు. "తన అభిప్రాయాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేవాళ్లకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశాను" అని ఆయన పేర్కొన్నారు. దీంతో... "నాయకులు (Leaders), నాయకత్వం (Leadership) లకున్న తేడా జితేందర్ రెడ్డికి తెలియకపోతే అది జనం తప్పా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
అనంతరం.. తాజాగా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ విషయం లో కూడా జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రఘునందన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆవేదన చెందిన వీడియోని పోస్ట్ చేసిన జితేందర్... రఘునందన్ ని జాతీయ అధికార ప్రతినిధి చేయాల ని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో.. ఈ ట్వీట్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ లో కీలక మార్పుల కు పార్టీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుడుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో త్వరలో కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు జి.కిషన్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించనుందని ఊగాహాణాలు వెలువడుతున్నాయి! ఈ సమయం లో సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్ల పై జితేందర్ ఇలాంటి ట్వీట్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది.