మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన జితేందర్ రెడ్డిని తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తోందా? అంటే ఔననే సమాధానం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోందట.. త్వరలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి నియామకం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ బీజేపీలో చాలా మంది నేతలు ఉన్నా జితేందర్ రెడ్డినే అధ్యక్షుడిని చేయడానికి కారణాలేంటన్న ప్రశ్న ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో ఉదయిస్తోంది. ఇప్పటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులందరినీ పరీక్షించిన బీజేపీ వారితో తెలంగాణలో ఏమాత్రం బలం పుంజుకోలేదు. అందుకే ఇప్పుడు వలసవచ్చిన నేతల్లో బలమైన వారికి ఒకసారి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించింది.అందుకే ఇప్పుడు అందరిలోకి జితేందర్ రెడ్డి మెరుగు అని ఆలోచిస్తోందట..
జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ కు చెందిన నేత. ఈయన ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి, ఏబీవీపీకి ఎప్పుడూ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీ, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. ముఖ్యంగా తెలంగాణలోనే బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయన తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కీలక నేతలతో బాగా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరాక క్రియాశీలంగా మారి వివిధ పార్టీల నాయకులను బీజేపీలోకి తీసుకురావడానికి బీజేపీకి సహాయపడుతున్నారట..
ఇక జితేందర్ రెడ్డి బాగా ఆర్థికంగా ఉన్న నేత. పెద్ద మొత్తంలో బీజేపీకి నిధులు సమకూర్చగల సామర్థ్యం జితేందర్ రెడ్డికి ఉందని బీజేపీ కేంద్రం నాయకత్వం భావిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి బరిలో ఐదు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ మంత్రి డీకే అరుణ, జితేందర్ రెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నారు.
వీరిలో జితేందర్ రెడ్డి, అరుణలు ఒకే జిల్లాకు చెందిన వారు.. ఈసారి హైదరాబాద్ వెలుపలి జిల్లాలకు చెందిన వారికే అధ్యక్ష పీఠం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందట.. అందరిలోకి మెరుగ్గా జితేందర్ రెడ్డి కనిపిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.