టెర్రరిస్ట్ పోలీస్.. రియల్ క్రైమ్ పోలీస్ దొరికాడు

Update: 2020-01-12 08:07 GMT
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న డీఎస్పీ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. కశ్మీర్ లోని ఖాజీగండ్ లోని మీర్ బజార్ వద్ద హిజ్బుల్ ముజాయిద్దీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో డీఎస్పీ రవీందర్ సింగ్ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రవీందర్ సింగ్ గత ఏడాదే రాష్ట్రపతి పోలీస్ మెడల్ అందుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులతో చిక్కడం సంచలనంగా మారింది.

హిజ్బుల్ ఉగ్రవాద సంస్థలో కీలక కమాండర్ నవీద్ బబు, మరో ఉగ్రవాది రథేర్ లతో డీఎస్పీ రవీందర్ సింగ్ దొరికాడు. వీరి వద్ద నుంచి రెండు ఏకే47 తుపాకులు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రవీందర్ సింగ్ జమ్మూకశ్మీర్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో యాంటీ-హైజాకింగ్ విభాగంలో శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో పోరాటంలో ప్రతిభ కనబర్చి  డీఎస్పీగా గతంలో ప్రమోషన్ పొందాడు. అయితే ఆరోపణలు రావడంతో  సస్పెండ్ చేసి ఇటీవలే తీసుకున్నారు.

దేవేందర్ సింగ్ 2001లో పార్లమెంట్ దాడి సమయంలోనూ ఉగ్రవాదులకు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ప్రధాన నిందితుడు అప్ఝల్ గురు తనకు దేవేందర్ సింగ్ సహకరించాడని ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలు నిరూపితం కాలేదు. ఇక ప్రస్తుతం పట్టుబడ్డ నవీద్ ఉగ్రవాది కూడా మాజీ పోలీస్ ఉద్యోగియే. దీంతో పోలీస్ మాటున దేవేందర్ సింగ్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పనిచేస్తున్నాడని తెలుస్తోంది.

    

Tags:    

Similar News