తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గొప్ప శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 91142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80037 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.
మిగిలిన 11103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకూ 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు.
నియామకాల్లో 95 శాతం స్తానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం తెలిపారు.
-తెలంగాణలో ఖాళీలు ఇవీ
సీఎం కేసీఆర్ ప్రకటన ప్రకారం.. హోంశాఖలో అత్యధికంగా 18344 పోస్టులు, విద్యాశాఖలో 13086, వైద్య ఆరోగ్యశాఖలో 12755, ఉన్నత విద్యాశాఖలో 7878, బీసీ సంక్షేమ శాఖలో 4311 పోస్టులను భర్తీ చేయనున్నారు.