అమెరికాకు వెళ్లాలని.. అక్కడే ఉద్యోగంలో స్థిరపడాలని చూసేవాళ్లకు శుభవార్త. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక పరిస్థితులు కొంచెం కకఠినంగా మారినప్పటికీ అక్కడ ఉద్యోగ అవకాశాలేమీ తగ్గిపోలేదు. వచ్చే ఏడాది అమెరికాలో ఉద్యోగాలు పెరగబోతున్నాయి. ఈ పెరుగుదల 19 శాతం ఉండబోతోందని ఓ సర్వేలో తేలింది. మేజర్ డిగ్రీలు చేసిన వాళ్లకే కాదు.. బేసిక్ డిగ్రీలు చేసిన వాళ్లకు కూడా భారీ ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి.
మిచిగాన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఓ బృందం అమెరికాలోని వివిధ సంస్థల్ని కలిసి ఈ సర్వేను తయారు చేసింది. వచ్చే ఏడాది భారీగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నట్లు ఈ రిక్రూటింగ్ ట్రెండ్స్ సర్వే స్పష్టం చేసింది. బ్యాచిలర్ డిగ్రీలు చేసిన వాళ్లకు 15 శాతం.. అసోసియేట్ డిగ్రీలు చేసిన వాళ్లకు 40 శాతం ఉద్యోగాలు పెరిగే అవకాశమున్నట్లుగా ఈ సర్వేలో తేలింది.
సాధారణంగా మేజర్ డిగ్రీలు చేసిన వాళ్లకే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐతే వచ్చే ఏడాది తలెత్తే డిమాండ్ మేరకు బ్యాచిలర్ డిగ్రీలు చేసిన వాళ్లకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ వచ్చాక వీసా నిబంధనలు కఠినతరం చేయడం.. స్థానికులకే పెద్ద పీట వేస్తుండటం జరుగుతున్నప్పటికీ అమెరికా అవసరాల మేరకు సేవలందించాలంటే వేరే దేశాల నిపుణులపై ఆధారపడక తప్పట్లేదు. ముఖ్యంగా భారతీయుల్ని విస్మరించడానికి ఎంతమాత్రం అవకాశం లేదు.