అమెరికా అధినేత జో బైడెన్ కి తాను పెంచుకునే శునకం మేజర్ అంటే ఎనలేని అభిమానం. అయితే, వైట్ హౌస్ కి కొత్త అయిన ఆ మేజర్ డాగ్ అక్కడ కొంచెం రచ్చ చేస్తుంది. వైట్ హౌస్ వద్ద ఇది ఎవరినో కరిచి కొంచెం గాయపరిచిందని ఈ హౌస్ మహిళా అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. మూడేళ్ళ వయసున్న ఈ జర్మన్ షెఫర్డ్ గుర్తు తెలియని వ్యక్తిని కరిచి గాయపర్చినట్టు ఆమె చెప్పారు. కుక్క కరిచిన విషయం తెలియగానే వైట్ హౌస్ సిబ్బంది మెడికల్ యూనిట్ ఆ వ్యక్తిని పరీక్షించిందట.
ఇదిలా ఉంటే , అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు పెంచుకుంటున్న రెండు శునకాలు కొత్త వాతావరణం,కొత్త పరిస్థితులకు ఇంకా అలవాటు పడాల్సి ఉందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. కాగా ఈ మేజర్ జాగిలం సెక్యూటిటీ స్టాఫ్ మెంబర్ ఒకరిని కరిచినట్టు సీఎన్ ఎస్ వార్తా సంస్థ తెలిపింది. అది ఆ వ్యక్తి చేతిని గాయపరిచేంత పని చేసిందని, కానీ అదేమంత పెద్ద గాయం కాదని ఈ సంస్థ ప్రకటించింది. తమ రెండు శునకాలను వాషింగ్టన్ లోని తమ 18 ఎకరాల కొత్త హోం కి అలవాటు చేయడానికి ఫస్ట్ లేడీ జిల్ ప్రయత్నం చేస్తున్నారు. 2018 లో బైడెన్ దంపతులు మేజర్ ని, మరో కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఇవి అంటే వారికి వల్లమాలిన అభిమానం.. తాము ఎక్కడికి వెళ్లినా వీటిని కూడా వాళ్ళు తీసుకుకెళ్తుంటారు. తమకుటుంబ సభ్యుల మాదిరే వీటిని చూసుకుంటారు. గత కొన్ని రోజుల ముందు మేజర్ సాక్షాత్తూ జోబైడెన్ నే కాలిపై స్వల్పంగా కరవడంతో ఆయన నడకలో కాస్త తడబడాల్సి వచ్చింది. ఏదేమైనా పెంపుడు కుక్కలు అయినప్పటికీ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.
బైడెన్ వద్ద ఉన్న రెండు కుక్కలూ జర్మన్ షెపర్డ్ జాతికి చెందినవే. వాటి పేర్లు ఛాంప్, మేజర్ 7. ఈ జాతి కుక్కలు పెద్దగా అరవవు. యాక్టివ్ గా ఉండవు. కానీ... ఎప్పుడైనా ఎవరినైనా టార్గెట్ చేస్తే మాత్రం. కండ పట్టుకుంటే అది ఊడేదాకా వదలవు. యజమానులు చెప్పినట్లు వింటాయి. అందుకే ఈ కుక్కలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 2008లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జో బిడెన్, తన భార్యకు ఛాంప్ కుక్కను గిఫ్టుగా ఇచ్చారు. ఆ కుక్క కూడా మొన్నటి ఎన్నికల ప్రచారంలో అప్పుడప్పుడూ వెంట ఉంది.ఇలా వైట్‌హౌట్‌కి పెంపుడు జంతువుల్ని తెచ్చే సంప్రదాయం ఇప్పటిది కాదు. జార్జి వాషింగ్టన్... తొలిసారిగా కుక్కను వెంట తెచ్చారు. ఆ తర్వాత వస్తున్న అధ్యక్షులందరూ... ఏవో ఒక ప్రాణులను తెస్తూనే ఉన్నారు. ట్రంప్ మాత్రం డిఫరెంట్. ఆయన ఏ ప్రాణులనూ పెంచట్లేదు. అందువల్ల వేటినీ వెంట తేలేదు. నాలుగేళ్లుగా వైట్‌హౌస్‌లో ఏ కుక్కలూ లేవు. మళ్లీ ఇప్పుడు బైడెన్ తమ కుక్కలతో వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.