ఎన్నికల్లో ట్రంప్ జిత్తులను చిత్తు చేసి విజయం సాధించిన బైడెన్ బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ పదవి నుంచి దిగి పోవడానికి ట్రంప్ నిరాకరించడంతో దీనిపై కూడా బైడెన్ పోరాటం చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు నేడు ట్రంప్ దిగిపోనుండగా బైడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించే వారు. అయితే ఈసారి కరోనాను దృష్టిలో ఉంచుకొని వేడుకలో ప్రత్యేక నిబంధనలు పాటించనున్నారు.
అదే విధంగా ట్రంప్ మద్దతు దారులు ఇటీవల పార్లమెంట్ క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రత చేపట్టనున్నారు.గతంతో పోలిస్తే ఈసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం భిన్నంగా సాగనుంది. ఈ కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తిచేసిన వెంటనే బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడు అవునున్నారు.
ముందుగా అధ్యక్ష పదవి కన్నా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం 20వ తేదీ బుధవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. అమెరికా కాలమానం ప్రకారం అధ్యక్షుడు ప్రారంభోపన్యాసం 11:30 గంటలకు ప్రారంభం కానుండగా ఆ కార్యక్రమం భారత్ లో బుధవారం రాత్రి 10 గంటలకు మొదలవుతుంది.
క్యాపిటల్ భవనం వెస్ట్ ఫ్రంట్ లో బైడెన్ చేత చీఫ్ జస్టిస్ జాన్ జీ రాబర్ట్స్ జూనియర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షులు తను ప్రారంభ ప్రసంగం చేయనున్నారు. అనంతరం మామూలుగా అయితే సాంప్రదాయక కవాతు నిర్వహించాల్సి ఉండగా దానికి బదులు వైట్ హౌస్ చేరుకుని కరోనాతో చనిపోయిన అమెరికా రియల్ హీరోలకు నివాళులర్పించనున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని వర్చువల్ పరేడ్ నిర్వహించనున్నారు.