మొన్నటి నంద్యాల బహిరంగ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని మొన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం దాకా తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ ధర్నాలు, జగన్ దిష్టిబొమ్మల దహనాలకు పాల్పడ్డారు. టీడీపీలో కాస్తంత మంచి స్వరం ఉన్న నేతలంతా జగన్ ను టార్గెట్ చేస్తూ ఘాటు కామెంట్లే చేశారు. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేకున్నా కూడా... తమ బండారం బయటపెట్టారన్న ఒకే ఒక్క కారణంతో తెలుగు తమ్ముళ్లు నానా యాగీ చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
ప్రజల సమక్షంలో సభా వేదికపైనే టీడీపీ నుంచి తనకు అందిన ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసిన వైనాన్ని ప్రస్తావించిన జోగి... దమ్ముంటే వైసీపీ టికెట్లపై గెలిచి టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అయినా చంద్రబాబును రాక్షసుడిలా అభివర్ణిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేదని, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును రాక్షసుడితో కాకుండా రాముడితో పోల్చమంటారా? అని కూడా జోగి ప్రశ్నించారు. చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించిన జగన్ చర్యను జీర్ణించుకోలేని చంద్రబాబు... తన పచ్చ దండును ఉసిగొల్పి తాను మాత్రం గుంట నక్కలా దాక్కున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆదేశాలతో ముందూ వెనుకా చూసుకోకుండా రోడ్లపైకి వచ్చిన టీడీపీ నేతలు చిత్తకార్తు కుక్కల్లా వ్యవహరిస్తున్నారని జోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అసలు ఆందోళనలు ఎందుకు చేయాలో కూడా తెలియని రీతిలో టీడీపీ నేతలు ఒళ్లు విరుచుకుంటున్న వైనాన్ని చూసిన తర్వాతే... వారిని చిత్తకార్తె కుక్కలుగా చెప్పాల్సి వస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏ కోశానా తప్పులేని జగన్ వ్యాఖ్యలపై ఆరాలు పేరాలు తీస్తున్న మంత్రులపైనా జోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచ్ఛీల రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన కారణంగానే తన వద్దకు వచ్చిన శిల్పాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారని, జగన్ లాంటి దమ్ము, ధైర్యం ఉంటే... టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని కూడా ఆయన సవాల్ విసిరారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని, దేనికైనా సిద్ధమేనని కూడా జోగి ఘాటుగా ప్రతిస్పందించారు. మరి జోగి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి.