తెలంగాణ నిర్మస్తున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపి నేత జోగి రమేష్ మండిపడ్డారు. కృష్టా డెల్టా ఎడారి అవుతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విరుచుకుపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 150 టీఎంసీ ల నీటిని తెలంగాణ తరలించుకుపోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. సొంత బలహీనత కారణంగా కేంద్రం - కేసీఆర్ వద్ద చంద్రబాబు గంగిరెద్దులా మారిపోయాడని విమర్శించారు. పనిలో పనిగా ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాను కూడా ఆయన ఏకిపారేశారు.
తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్టా ట్రిబ్యునల్ కు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని జోగి రమేష్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడే కేసీఆర్ ఏం చేస్తున్నా చంద్రబాబు మాట్లాడడం లేదని ఆరోపించారు. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒక పెద్ద దద్దమ్మ అని జోగి రమేష్ విమర్శించారు. ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు కబుర్లు చెప్పడం తప్పా దేవినేని ఉమాకు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం చేసే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని అన్నారు.