సౌమ్యుడు - మృదు స్వభావి - వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు కూడా ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో కోపం వచ్చింది. నిజానికి ఎప్పుడూ సౌమ్యంగా ఉండే జోగి.. బాబు వైఖరితో విసిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన సీఎంపై ఎక్కిదిగారని అనిపిస్తోంది. సీఎం నోరు తెరిస్తే.. అబద్ధాలే వస్తాయని, ఆయన నోటికి నిజాలు మాట్లాడితే గండం ఉందని జోగి ఎద్దేవా చేశారు. 2013 కాకినాడ ఎన్నికల సభలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రెండు సార్లు చార్జీలు పెంచారన్నారు.
దీని ప్రకారం ప్రజలపై రూ.4,700 కోట్లు భారం మోపారని జోగి విమర్శించారు. అంతటితో ఆగకుండా మూడో విడత కూడా కరెంట్ చార్జీలను పెంచేందుకు సిద్దమయ్యారని తెలిపారు. కనకదుర్గమ్మ సాక్షిగా విద్యుత్ చార్జీలపై అబద్ధాలు మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను దోచేస్తున్నారని అన్నారు. రుణమాఫీ కాకపోవడంతో డ్వాక్రా మహిళలు బాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారన్నారు.
మేనిఫెస్టోలో రైతన్నలకు రుణమాఫీ అంటూ మోసం చేశారన్నారు. ఇసుక - మట్టి - ల్యాండ్ పూలింగ్ ల పేరుతో దోచుకుంటున్నారని జోగి రమేష్ ఆరోపించారు. రాష్ట్రంలో బాబు పాలనలో టీడీపీ తమ్ముళ్లు బాగు పడుతున్నారని అన్నారు. మొత్తానికి బాబు పాలన పూర్తిగా అవినీతి మయంగా మారిందని చెప్పుకొచ్చారు. అధికారుల మాటలకు విలువ లేకుండా పోతోందని, తెలుగు దేశం ఎంపీలు - ఎమ్మెల్యేలు అధికారులపై దాడులకు దిగుతున్నారని, వారు దాడులకు దిగుతుంటే.. చంద్రబాబు వాటిని సెటిల్ చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి సీఎం సెటిల్ మెంట్ల సీఎంగా మారారని దుయ్యబట్టారు.