ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నదుల పరిరక్షణ అంటూ చంద్రబాబు మాట్లాడుతుంటే నవ్వొస్తోందని... ఆయనకు నదుల పరిరక్షణ గురించి మాట్లాడే హక్కే లేదని అన్నారు. కృష్ణా నది పక్కన అక్రమంగా కట్టిన భవంతిలో నివసిస్తున్న ముఖ్యమంత్రి నదుల పరిరక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమని ఆయన ఏకిపడేశారు.
సేవ్ రివర్స్ పేరుతో చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై రమేశ్ విమర్శలు కురిపించారు. సేవ్ రివర్స్ అంటూ చంద్రబాబు అన్నీ రివర్స్ పనులే చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు జీవితమే అక్రమాలమయమని అన్నారు. టీడీపీలో చేరి, మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని చెప్పారు.
నీటిపారుదల ప్రాజెక్టుల్లో సైతం చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని రమేశ్ అన్నారు. కేవలం కమిషన్ల కోసమే కొన్ని సంస్థలను పక్కనపెట్టడం, మరికొన్నిటిని నెత్తిన పెట్టుకోవడం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి నిర్మాణాలకు సినీ దర్శకుల సహకారం కావాలా? అని ప్రశ్నించారు. నిర్మాణాలకు సంబంధించి డైరెక్టర్లకు ఏం తెలుస్తుందని... ఇంజినీర్లకైతే అవగాహన ఉంటుందని అన్నారు.