ప్రముఖ జర్నలిస్టు... రచయిత, విశ్లేషకుడు అయిన రాజీవ్ శర్మను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈనెల 14న ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
కాగా రాజీవ్ శర్మ వద్ద రక్షణకు సంబంధించిన పత్రాలు లభించాయని పోలీసులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోందని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
ద ట్రిబ్యూన్, సాకాల్ టైమ్స్, యూనైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే వార్త సంస్థల్లో రాజీవ్ శర్మ పనిచేశారు. ఇటీవల చైనాకు చెందిన ‘గ్లోబల్ టైమ్స్ లో కూడా ఒక ఆర్టికల్ రాశాడు. రక్షణ కు సంబంధించిన విషయంలో పలు పత్రాలు చేరవేశారనే ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే 14న అరెస్ట్ చేసి.. 15వ తేదీన శర్మను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. ఆరురోజుల కస్టడీకి కోర్టు ఇచ్చింది. దీంతో రక్షణ పత్రాలకు సంబంధించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
రాజీవ్ శర్మకు ‘రాజీవ్ కిష్కింధ’ పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ఉంది. శర్మ అరెస్ట్ అయ్యేరోజు తన చానెల్ లో రెండు వీడియోలు అప్ లోడ్ చేశారు. అందులో చైనా ఇప్పటికీ అల్లర్లు చేయవచ్చు అని పేర్కొన్నారు. ఇంకో వీడియోలో దేశంలో మీడియా వాచ్ డాగ్ లా ఉండాలని.. లాప్ డాగ్ లా మారిందని విమర్శిచాడు.ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ దేశ జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది.