వైసీపీపై ఎగిరారు.. స‌రే! ప్ర‌జ‌ల మాట విన్నారా.. న‌డ్డా జీ!!

Update: 2022-06-08 13:30 GMT
ఏపీలో రెండు రోజుల పాటు ప‌ర్య‌టించిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా.. అధికార పార్టీ వైసీ పీపై విరుచుకుప‌డ్డారు. ఇంకేముంది.. వైసీపీని ప్ర‌జ‌లు బుట్ట‌దాఖ‌లు చేసేందుకు.. చెత్త‌కుండీలో వేసేందు కు రెడీ అయ్యార‌ని అన్నారు. కేంద్రం ఇస్తున్న ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ త‌న స్టిక్క‌ర్లు వేసుకుంటున్నా ర‌ని చెప్పా రు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని తామే ప్ర‌వేశ పెట్టుకున్నామ‌ని డ‌బ్బా కొట్టుకున్నారు. ఇత‌ర ప‌థ‌కాల కోసం నిధులు ఇస్తుంటే.. వాటిని దారిమ‌ళ్లిస్తున్నార‌ని.. నిప్పులు చెరిగారు.

అంతేకాదు..జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌తిప‌క్షాల‌కు స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని చెప్పుకొచ్చారు. కేసులు పెడు తున్నార‌ని అన్నారు. స‌రే.. ఇదంతా స‌హ‌జంగానే అధికార‌పార్టీపై విమ‌ర్శ‌లు చేయాలి కాబ‌ట్టి రాజ‌కీయ కోణం లో చూసుకున్న‌ప్పుడు న‌డ్డా చేసింది క‌రెక్టే అని అనిపిస్తుంది.

అయితే.. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న ప్ప‌టికీ.. సుదీర్ఘ ప్ర‌సంగాల‌ను దంచి కొట్టిన జేపీ న‌డ్డా.. ఏపీ ప్ర‌జ‌ల వాణిని, బాణిని విన్నారా? అనేది మిలి య‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏపీలో అధికారంలోకి రావాలంటే.. ప్ర‌జ‌న‌లు ఏం కోరుకుంటున్నారు?  వారి మ‌నోభా వాలు ఏంటి? అని ఒక్క‌సారైనా నేత‌ల‌ను అడిగి తెలుసుకున్నారా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. 2014లో స్వ‌యంగా అప్ప‌టి ప్ర‌ధాని అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామన్నా రు. పోల‌వ‌రం పూర్తి చేసే బాద్య‌త‌ను తామే తీసుకుంటామ‌న్నారు. క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామ న్నారు.

వెనుక బ‌డిన ప్రాంతాల అభివృద్ధిని నెత్తికెత్తుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్ప‌టికి 8 ఏళ్లు పూర్త‌యినా.. వీటిపై అతీగ‌తీ లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌.. బాధ ఏపీ ప్ర‌జ‌ల్లో గూడుక ట్టుకుంది. మ‌రి నిజానికి ఏపీలో పాగా వేయాల‌ని కుతూహ‌లం ప్ర‌ద‌ర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర నేత‌లు కానీ.. న‌డ్డా కానీ.. ఈ విష‌యాల‌పై ఎక్క‌డా ప్ర‌స్తావ‌న చేయ‌లేదు.

క‌నీసం.. ఏపీ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్నవిభ‌జ‌న క‌ష్టాల‌ను కూడా ప్ర‌స్తావించ‌లేదు. నీటి వివాదాల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో చెప్ప‌లేదు. అన్నిటిక‌న్నా కీల‌క‌మైన అమ‌రావ‌తి రాజ‌ధానిపై బీజేపీ వ్యూహం ఏంటో వివ‌రించ‌లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. జ‌గ‌న్ స‌ర్కారు అప్పులు చేస్తోంద‌న్న న‌డ్డా.. అస‌లు అప్పులు ఇంత రేంజ్‌లో పెరిగిపోవ‌డానికి కేంద్రంలోని మోడీ స‌ర్కారే కార‌ణ‌మ‌న్న విష‌యాన్ని ఎలా మ‌రిచిపోయార‌ని ప్ర‌శ్నిస్తున్న మేధావుల‌కు కూడా స‌మాధానం చెప్ప‌లేదు. వెర‌సి.. న‌డ్డా ప్ర‌సంగాలు.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు.. సినిమాను త‌లపించాయే త‌ప్ప‌.. ఫ‌లితం క‌నిపించ‌లేదని అంటున్నారు రాజ‌కీయ నేత‌లు.
Tags:    

Similar News