అసలే రాష్ట్రంలో బీజేపీ పరిస్ధితి అంతంతమాత్రం. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పార్టీ పరిస్ధితి మరీ ఘోరంగా ఉంది. ఇలాంటి పరిస్ధితిలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు మరింత అధ్వాన్నంగా మార్చేశాయి. నిజానికి బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు డిపాజిట్ దక్కితే అదే చాలా ఎక్కువ. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి డిపాజిట్ దక్కుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే జనసేనతో కలిసి పనిచేస్తోంది కాబట్టి.
ఉపఎన్నికలో గెలవబోయేది తామే అని కమలనాదులు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్ధితి ఏమిటో అందరితో పాటు వాళ్ళకు కూడా బాగా తెలుసు. బీజేపీ ఇపుడు చేస్తున్న పోరాటమంతా కేవలం డిపాజిట్ దక్కించుకునేందుకే. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రచారం కోసమని వచ్చిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలకు బాగా ఇబ్బందిగా తయారయ్యాయి.
ప్రచారంలో నడ్డా మాట్లాడుతు బీజేపీ అధికారంలోకి వస్తే ఇపుడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపేస్తుందని స్పష్టంగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలన్నీ నిరుపయోగమైనవే అంటు మండిపడ్డారు. సంక్షేమపథకాల అమలు పేరుతో జగన్ చేస్తున్న ఖర్చంతా అనుత్పాదకమైనదే అంటు ప్రకటించారు. సంక్షేమపథకాల అమలు పేరుతో రాష్ట్ర సంపదను, ఆదాయాన్ని జగన్ దుబారా చేస్తున్నట్లు ఆరోపించారు.
ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న నరేంద్రమోడి నిర్ణయంతో జనాలంతా మండిపోతున్నారు. ఇదే సమయంలో నడ్డా వచ్చి సంక్షేమపథకాలను నిలిపేస్తామని బహిరంగసభలో ప్రకటించటమంటే ఏమిటర్ధం ? అంటే రాష్ట్రం మొత్తాన్ని ప్రైవేటుపరం చేసేయాలనే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమో సంక్షేమపథకాలు అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఒకవైపు మిగిలిన రాష్ట్రాల్లో సంక్షేమపథకాలు అమలు చేస్తు ఏపిలో మాత్రం నిలిపేస్తామని ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. నరేంద్రమోడి సర్కార్ ఏపి మీద ఏదో పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మోడి ప్రధానమంత్రి కాగానే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. అలాగే ఏపి డెవలప్మెంట్ ను కూడా పక్కన పెట్టేశారు. చివరకు ఆంధ్రాబ్యాంకు పేరును కూడా మార్చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధులను నిలిపేశారు. తాజాగా నడ్డా ప్రకటన విన్నవారికి ఉపఎన్నికలో బీజేపీకి ఎందుకు ఓట్లేయాలనే సందేహం వస్తే ఆ తప్పు ఓటర్లది కాదు.