జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే గడువుండడంతో పార్టీలన్నీ ప్రచారంలో తలమునకయ్యాయి. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో మంచి ఊపు మీదున్న బీజేపీ గ్రేటర్ వార్ లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చేందుకు బీజేపీ తన ప్రచారంలో జాతీయ స్థాయి నేతలను దించింది. బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా....కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించే సమయం దగ్గరపడిందని నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అవినీతి పాలనను అంతం చేసేందుకు మోడీ సారధ్యంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్న వారికి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు నిర్వహించిన రోడ్ షో సందర్భంగా టీఆర్ఎస్ పాలనపై నడ్డా విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని అన్ని డివిజన్లలోనూ గెలిపించాలని, తద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ రోడ్ షోలో భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై....జై శ్రీరామ్ అన్న నినాదాలతో రోడ్ షో మార్మోగిపోయింది. జై మోడీ...డౌన్ డౌన్ కేసీఆర్ అంటూ కార్యకర్తలు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేస్తామని, త్వరలోనే తెలంగాణలో కమలం వికసిస్తుందని నడ్డా అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అవినీతి, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని నడ్డా దుయ్యబట్టారు. బీసీలను, పేదలను కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని, పార్టీ గెలుపు కోసం ఎక్కడికైనా వస్తానని నడ్డా అన్నారు. తెలంగాణలో కారు జోరు తగ్గిందని, టీఆర్ఎస్ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని నడ్డా విమర్శించారు.