విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ ఉద్యమం ఏపీలో ఉవ్వెత్తున సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా చేసి మరీ హీటెక్కించాడు. సీఎం జగన్ సైతం ఈరోజు విశాఖ ఉక్కు ఉద్యమకారులతో భేటి అయ్యి ప్రైవేటీకరణను అడ్డుకుంటానని మాట ఇచ్చారు.
ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లి అమిత్ షాను కలిసినా ఆయనకు చుక్కెదురైంది. తాజాగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిలిపివేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అండ్ టీం ఢిల్లీకి వెళుతూ ఉద్యమకారులకు మాట ఇచ్చారు.
అయితే ఢిల్లీకి వెళ్లిన ఏపీబీజేపీ చీఫ్ సోము వీర్రాజు సహా నేతలకు పెద్ద షాక్ తగిలినట్టు సమాచారం. తనతో పార్టీకి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించాలని జేపీ నడ్డా కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. అయినా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమంపై సోము వీర్రాజు ప్రస్తావించేందుకు ప్రయత్నించగా జేపీ నడ్డా అడ్డుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాలు అయితేనే తనతో మాట్లాడాలని.. ఇతర అంశాలు సంబంధిత మంత్రులతో మాత్రమే చర్చించాలని జేపీ నడ్డా గట్టిగా చెప్పారట..
తనకు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సహా అభివృద్ధి అంశాలు మాట్లాడితే ఎలాంటి ఉపయోగం ఉండదని జేపీ నడ్డా స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో కేంద్రంలోని పెద్దలను ఒప్పించలేక.. ఇటు రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన విషయంలో ఏం చేయలేక రాష్ట్ర బీజేపీ నేతలకు పెద్ద షాక్ తగిలినట్టు టాక్ నడుస్తోంది.