చంద్రబాబునాయుడుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ గట్టిగా తగులుకుంది. వరద, తుఫాను బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
టీడీపీ అధినేత ఎక్కడ పర్యటిస్తే అక్కడ, ఎక్కడ మాట్లాడితే అక్కడ జూనియర్ అభిమానులు అడుగడుగునా అడ్డు తగులుతునే ఉన్నారు. జూనియర్ ఎన్టీయార్ జిందాబాద్ అని, జూనియర్ కు జై అంటు గట్టిగా నినాదాలతో హోరెత్తించారు. జూనియర్ బొమ్మలున్న జెండాలు, బ్యానర్లను ప్రదర్శించారు.
కొంతకాలంగా జూనియర్ అభిమానులు చంద్రబాబు కార్యక్రమాల్లో బాగా గోల చేస్తున్న విషయం తెలిసిందే. కుప్పంలో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా బ్యానర్లు, జెండాలు ప్రదర్శిస్తూ జూనియర్ కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తించేస్తున్నారు. జూనియర్ పేరుతో జెండా దిమ్మలను కూడా కుప్పంలో అభిమానులు నిర్మించారు. తర్వాత ప్రకాశం జిల్లా పర్యటనలో కూడా జూనియర్ అభిమానులు ఇలాగే వ్యవహరించారు.
ఇది సరిపోదన్నట్లుగా ఒంగోలులో నారాలోకేష్ పర్యటించినపుడు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి బ్యానర్లు, జెండాలు ప్రదర్శించారు. ఒకవైపు చంద్రబాబు అండ్ కో బహిరంగంగా జూనియర్ ప్రస్తావన ఎక్కడా వినబడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇదే సమయంలో జూనియర్ అభిమానులేమో చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో రెచ్చిపోతున్నారు. ఇపుడు చంద్రబాబు కోనసీమ పర్యటనల్లో కూడా ఇదే జరిగింది. దీన్ని ఎలా అడ్డుకోవాలో టీడీపీ నేతలకు అర్ధం కాలేదు.
ఏమిచేయాలో తెలీక అభిమానులను పట్టించుకోకుండా చివరకు అలా వదిలేశారు. చూస్తుంటే ముందు ముందు జూనియర్ ఎన్టీయార్ అభిమానులతో పార్టీకి తలనొప్పి తప్పేట్లు లేదు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ దాదాపు 130 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఒకపుడు పార్టీ ప్రచారంలో బాగా యాక్టివ్ గా ఉన్న జూనియర్ తర్వాత రాజకీయ పరిస్దితుల కారణంగా దూరమైపోయారు. జూనియర్ ను పార్టీకి దగ్గరగా చేర్చేందుకు కొందరు ప్రయత్నించినా సాధ్యంకాలేదనే ప్రచారం ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో జూనియర్ పార్టీకి ప్రచారం చేస్తారో లేదో చూడాలి.