జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: ఆ వాహనాలే కారణం? నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో చిక్కుముడులను పోలీసులు విప్పుతున్నారు. అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)పైనే తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఒక్క వాహనమే కాదు.. హైదరాబాద్ లో వేలకొద్దీ వాహనాలు ఇలా తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే తిరుగుతూ గందరగోళానికి కారణమవుతున్నాయి.
సాధారణంగా బండి కొనుగోలు చేసిన 30 రోజుల లోపు వాహన యజమాని తన పేరిట శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అపరాధ రుసుముతో 6 నెలల్లోపు కూడా శాశ్వతంగా నమోదు చేసుకునేందుకు రవాణాశాఖ వెసులుబాటు కల్పించింది.కానీ కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంతోనే కాలయాపన చేయడం వల్ల క్రైంలు జరిగితే నిందితులను దొరకబట్టడం కానకష్టం అవుతోంది.
ఇక వీళ్లే కాదు.. ద్విచక్ర వాహనదారులు కూడా సంవత్సరాలు గడిచినా శాశ్వత నమోదు చేసుకోకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే రహదారులపై పరుగులు తీస్తున్నారు.దీంతో అనూహ్యమైన పరిస్థితుల్లో వాహనాల గుర్తింపులో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఇలా తాత్కాలిక నమోదుపై ఉన్న వాహనాల విషయంలో రవాణాశఆఖ కేవలం అపరాధ రుసుముకే పరిమితం కావడంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
సెకండ్ హ్యాండ్ బండ్లు తీసుకున్న వారు కూడా తమ పేరిట వాటిని మార్చుకోవడం లేదు. అనధికార యాజమాన్య మార్పిడి వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి పేరు మీద వాహనం ఉంటే వారే మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపైనా భారీ ఎత్తున జరిమానాలు నమోదు కావడం గమనార్హం.
ఇక అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు వినియోగించే వాహనాల్లోనూ వాటి అసలైన యజమానులే నష్టపోవాల్సి వస్తోంది. యాజమాన్యం కూడా బదిలీ చేసుకోకపోవడం వల్ల అప్పటి వరకూ ఎవరి పేరిట నమోదై ఉంటే వారే ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. గతంలో హత్యలు, నేరాల్లో వాహనాలతోపాటు వాటి మొదటి యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
-గ్యాంగ్ రేప్ నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో ముగ్గురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కు లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు పొటెన్సీ పరీక్షలు తప్పనిసరి. ఈ మేరకు పోలీసులు నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం నిందితులకు పరీక్షలు జరుపనుంది. మరోవైపు మైనర్ల పోలీస్ కస్టడీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.