జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం

Update: 2022-06-11 03:38 GMT
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో కీలక పరిణామం ఈరోజు చోటుచేసుకోబోతోంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం నిందితులు అందరూ పోలీసు కస్టడీలో ఉన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు సాదుద్దీన్ సహా మైనర్లను కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్ లో మైనర్లతో కలిపి సాదుద్దీన్ ను పోలీసులు విచారించనున్నారు.

జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో నిందితుడు ఏ1 సాదుద్దీన్ ను పోలీసులు రెండోరోజు కస్టడీకి తీసుకొని విచారించారు. పబ్ లో ఏం జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మాయిని ట్రాప్ చేయడం ద్వారా ఆ తర్వాత రేప్ చేయడం పథకంలో భాగమేనా? అన్న ప్రశ్నలు సంధించారు. తాజాగా మూడో రోజు మైనర్లతో కలిసి సాదుద్దీన్ ను ఒకేసారి అందరినీ కలిపి విచారించేందుకు రెడీ అయ్యారు.

జువైనల్ హోంలో మైనర్లను మొదటి రోజు విచారణ ముగిసింది. ముగ్గురు మైనర్లను వేర్వేరుగా విచారించారు పోలీసులు. కస్టడీలో ఉన్న కార్పొరేటర్ కొడుకును ప్రత్యేకంగా విచారించారు పోలీసులు.

ముగ్గురి నుంచి సమాచారం సేకరించింది దర్యాప్తు టీం. మైనర్లను ఈరోజు నుంచి జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారించనున్నారు. ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్కు మైనర్లను తరలిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ విచారిస్తారు. విచారణ అనంతరం జువైనల్ హోంకు తరలిస్తారు. జువైనల్ హోంలో పరిస్థితుల దృష్ట్యా జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరోవైపు బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక మెడికల్ రిపోర్ట్ పోలీసుల చేతికి వచ్చింది. బాలికపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి.. ఒంటిపై 12 తీవ్రగాయాలు చేసినట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. బాలిక నిరాకరించడంతో గోళ్లతో దాడి చేశారు. బాలిక ఒంటిపై 12 తీవ్రగాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో వీడియోలు వైరల్ చేసిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. బాలిక వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Tags:    

Similar News